ఏ సామాజికకోణం లేకుండా, సిద్దాంత రాజకీయాలు లేకుండా కింగ్‌ మేకర్ కావాలనుకున్నాడు జేడీఎస్‌ నాయకుడు హెచ్‌డీ కుమార స్వామి. వీలైతే కింగ్ కూడా మారాలనుకున్నాడు. ఆయన కన్న కలలు పటాపంచలయ్యాయి. పాత మైసూరు ప్రాంతంలో 60కిపైగా ఎమ్మెల్యే స్థానాలున్నాయి. అందులో జేడీఎస్‌కు 2018 ఎన్నికల్లో 28 స్థానాలు లభించాయి. కానీ ఇప్పుడు 14కు పడిపోయాడు. తన స్థానంలో తను దిగజారిపోయిండు కుమార స్వామి.

మొత్తం కర్ణాటకలో గతంలో 37 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన జేడీఎస్‌.. ఇప్పుడు 19తో సరిపెట్టుకున్నది. రాజకీయ పరిస్థితులు తనకు అనుకూలిస్తాయనుకున్నాడు. కానీ ఓ సిద్దాంతంతో పోలేదు. ప్రజలకు చేరువ కాలేదు. కాలం కలిసొస్తే తానే చక్రం తిప్పుతాననుకున్నాడు. చక్రవర్తినవుతానని కూడా కలలు కన్నాడు. కానీ అక్కడ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయాడు కుమార స్వామి. కింగ్‌ మేకర్, కింగ్ కలలు కల్లలు కాగా.. పాత వైభవమూ కోల్పోయి తన ప్రాంతంలోనే తను ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు పాపం…

You missed