Tag: TPCC

ఇన్ స‌రే…! ఔట్ ఎవ‌రు..?? కేబినెట్ నుంచి ఒక‌రి ఉద్వాస‌న‌…! కొండా నా..? జూప‌ల్లి నా..?? న‌లుగురికి కొత్త‌గా చాన్స్‌….! ఇందులో ఇద్ద‌రూ రెడ్లే… సుద‌ర్శ‌న్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిల పేర్లు ఖ‌రారు.. బీసీ నుంచి శ్రీ‌హ‌రి ముదిరాజ్‌, ఎస్సీ నుంచి వివేక్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎట్ట‌కేల‌కు ఊరిస్తూ ఊరిస్తూ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ఓకే చెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న త‌రుణం రానే వ‌చ్చింది. ఉగాది త‌రువాత కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంది. న‌లుగురికి చాన్స్ ల‌భించింది. మ‌రో ఇద్ద‌రి పేర్లు పెండింగ్‌లో…

న‌రేంద‌ర్‌ను అహంకారం ఓడించింది…! వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలిసినా.. అంద‌రినీ క‌లుపుకుపోని గ‌ర్విష్టి..!! త‌న‌కు ఎదురే లేద‌నుకున్నాడు…! స్పీచుల‌లో అవే గ‌ర్వ‌పు పోక‌డ‌లు..!! డ‌బ్బులు ఖ‌ర్చు చేసినా… ఓడించిన ఓట‌ర్లు… ! చివ‌ర‌కు ఏడుపు మిగిలింది… కంట‌త‌డి పెడుతూ ఇంటికి…!!

DANDUGULA Srinivas ఆల్ఫోర్స్ న‌రేంద‌ర్‌కు అహంకారం అంతాఇంతా కాదు. జ‌నాలు అన్నీ ఓర్చుకుంటారు గానీ, అహంకారం ప్ర‌ద‌ర్శిస్తే మాత్రం అంతే. బీఆరెస్‌ను చిత్తుగా ఓడించింది కూడా అందుకే. వారింకా మార‌లేదు. అది వేరే విష‌యం. ఇప్నుడు న‌రేంద్రుడి ప‌రిస్థితి కూడా అంతే.…

అప్పుడు కేసీఆర్‌… ఇప్పుడు రేవంత్‌…! బీజేపీ నెత్తిన పాలు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తిప‌క్షాన్ని నిలువునా పాత‌రేద్దాం అనే ఆలోచ‌న‌… ఆ పార్టీనే స‌మాధి చేసే స్థితిని చూశాం. అడిగేవాడుండొద్దు. నిల‌దీసే శ‌క్తి కాన‌రావొద్దు. ప్ర‌శ్నించే గొంతును నులిమేయాలి. నిలువునా పాత‌రేయాలి. ఆ త‌రువాత మ‌న‌మేం అవుతాం.. మ‌న‌కేం పాఠం చెబుతారు..? అనేది…

సీఎం మారుతున్నాడు…! మారుతున్నాడు…!! మారుతున్నాడు…!!! చేసిందేమీ లేదు… తెచ్చిందేమీ లేదు…!! రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ రోల్ ఇదే.. !!

Dandugula Srinivas బీజేపీ రోల్ ఇది. చెప్పేందుకేం లేదు. చేసిందీ మ‌రేం లేదు. ఏం చేయాలి మ‌రి. ఏదో ఒక విధంగా వార్త‌ల్లో ఉండాలె. వైర‌ల్ కావాలె. ఆల్ట‌ర్నేట్ పార్టీ మేమే అని జ‌నాలు న‌మ్మాలి. రేపు ప్ర‌భుత్వం ఏర్ప‌డేది మాదే…

నోరు జారి… ఇష్టారీతిన వాగి…!! ఇద్ద‌రు యూట్యూబ‌ర్లు ఔట్‌…! మొన్న బీజేపీ నుంచి ఒక‌డు… ఇవాళ కాంగ్రెస్ నుంచి తీన్మార్‌….!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాళ్లిద్ద‌రూ యూట్యూబ‌ర్లు. దానితోనే ఫేమ‌స్ అయ్యారు. ఏది ప‌డితే అది వాగ‌డం. ఎంత ప‌డితే అంత మాట్లాడ‌టం. ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియ‌ని ఓ ట్రాన్స్ వీరిద్ద‌రిది. ఒక‌రేమో బీజేపీలో రాష్ట్ర అధికార ప్ర‌తినిధి గిరీశ్ ధార‌మోని. ఇంకొక‌రు…

మీనాక్షి న‌ట‌రాజ‌న్‌…! ఓ భ‌క్తి… ఓ భ‌యం…!! రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ క‌ద‌లిక‌.. ఓ కుదుపు..!! ఎదురుగాలి ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఓ జీవం…! అసంతృప్త కాంగ్రెస్ శ్రేణుల‌కు ఓ ఊర‌ట‌… బ‌లం..!! ఫైర‌వీకారుల గుండెల్లో ద‌డ‌… ఆట‌లు సాగ‌వ‌నే సిగ్న‌ల్‌…!!!

(దండుగుల శ్రీ‌నివాస్) నిన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లో స్త‌బ్ద‌త‌. పెరుగుతున్న వ్య‌తిరేత‌తో ఆందోళ‌న‌. ప‌ట్టింపులేనిత‌నంతో ప‌రేషాన్‌. నేత‌ల అల‌స‌త్వం, అవినీతితో ప‌రువు బ‌జారుపాలు. సీఎం, పీసీసీ చీఫ్ ల‌కు చెడ్డ‌పేరు. ప‌రిస్థితులు చేతులు దాటుతున్నా ఏమీ చేయ‌ల‌ని నిస్స‌హాయ ప‌రిస్థితి. ఓ వైపు…

ఢిల్లీ గ‌ల్లీకి గ్యాప్‌..! మ‌రోసారి రాహుల్ సీరియ‌స్‌.. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు.. ముఖ్య‌మంత్రికి అంద‌ని స‌మాచారం.. బీసీల కుల‌గ‌ణ‌న‌పై గుస్సా… స్థానిక ఎన్నిక‌లు నిర‌వ‌ధికంగా వాయిదా..!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ (సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు) 9949774458 ఢిల్లీలో రాహుల్ గాంధీ మ‌రోసారి తెలంగాణ కాంగ్రెస్‌పై సీరియ‌స్ అయ్యారు. వ‌రంగ‌ల్‌లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. రాహుల్ వ‌చ్చేది పోయే స‌మాచారం సీఎం రేవంత్ రెడ్డికి చేర‌లేదు. బీసీ కుల‌గ‌ణ‌న‌పై ఆయ‌న అసంతృప్తి…

గ్రూపులు క‌ట్టొద్దు.. ! అంతా నా గ్రూపై ఉండాలి..!! రెబెల్ ఎమ్మెల్యేల‌ను దారిలోకి తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి..!! మీటింగు అందుకే..! అధిష్టానం నాకే స‌పోర్టు..! తింగ‌రి వేషాలేస్తే ఇక ఆట‌లు సాగ‌వ‌నే సిగ్నల్స్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తిరుగుబాటు ఎమ్మెల్యేల స‌ప‌రేట్ మీటింగు, మాటా మంతీ పార్టీకే కాదు త‌న‌కే పెద్ద అవ‌మానంగా , న‌ష్టంగా భావించాడు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే దీపాదాస్ మున్షీని తీసుకువ‌చ్చి మ‌రీ క్లాసులు పీకాడు. మీరు ఇలా గ్రూపులు క‌డితే…

పాముకు పాలుపోసి పెంచాం…! కుల గణ‌న‌పై తీన్మార్ మ‌ల్ల‌న్న పైత్య‌పు మాట‌ల‌పై అధిష్టానం భ‌గ్గు..! క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌కు సిద్దం.. మొద‌ట షోకాజ్ నోటీస్‌..!! మ‌ల‌న్న వెనుక బీఆరెస్‌.. కుట్ర‌లో భాగంగానే ఇదంతా…! భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. చాప‌ర్‌ను స‌మ‌కూర్చింది కూడా కేటీఆరే.. ! పార్టీ అధినాయ‌క‌త్వం వ‌ద్ద తీన్మార్ మ‌ల్ల‌న్న చిట్టా..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాముకు పాలు పోసి పెంచామంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ స‌పోర్టు లేకుండానే తీన్మార్ మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీగా గెలిచాడా..? అని నిల‌దీస్తున్నారు. కాంగ్రెస్ స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కుల గ‌ణ‌న‌పై పైత్య‌పు మాట‌లు మాట్లాడ‌టంపై భ‌గ్గుమంటున్నారు. ఏకంగా ఇది…

స‌ర్కార్ నాన్ సీరియ‌స్‌…! అధిష్టానం సీరియ‌స్‌…? తేనెతుట్టెను క‌దుపుతున్న కాంగ్రెస్ నాయ‌కులు.. ఢిల్లీకి తెలంగాణ‌కు పెరుగుతున్న దూరం… ?

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు 9949774458 ఫామ్ హౌజ్ పాల‌నా.. .ప్ర‌జా పాల‌నా…!! అన‌వస‌ర‌మైన ఈ అంశాన్ని చ‌ర్చ‌కు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కొత్త స‌మ‌స్య‌ను తెచ్చి పెట్టుకున్నారు. తేనె తుట్టెలో రాయి కొట్టిన‌ట్టు ట్విట్ట‌ర్‌ పిట్టగూడును క‌దిపి ..…

You missed