DANDUGULA Srinivas
ఆల్ఫోర్స్ నరేందర్‌కు అహంకారం అంతాఇంతా కాదు. జనాలు అన్నీ ఓర్చుకుంటారు గానీ, అహంకారం ప్రదర్శిస్తే మాత్రం అంతే. బీఆరెస్‌ను చిత్తుగా ఓడించింది కూడా అందుకే. వారింకా మారలేదు. అది వేరే విషయం. ఇప్నుడు నరేంద్రుడి పరిస్థితి కూడా అంతే. కాంగ్రెస్ అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి అతని ఓటమి కోసం శక్తులు పనిచేయడం మొదలు పెట్టాయి. అన్నీ తెలిసీ.. ఒద్దిగా నడుచుకోలేకపోయాడు. అదే అహంకారం ప్రదర్శించాడు. వేదికలపై కూడా పైత్యపు మాటలు మాట్లాడాడు. అంతా నన్ను ఓడించేందుకు పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.
కానీ నా గెలుపును ఎవరూ ఆపలేరు. గెలిచి తీరుతాను. నేను మొదటి నుంచీ ఇంతే. ఎవరెన్ని ప్రచారాలు చేసిన గెలిచి తీరుతాను. అదే జరగబోతుంది… అంటూ బీరాలు పలికాడు. అహంకారపు మాటలు మాట్లాడి వారిని మరింత రెచ్చగొట్టాడు. డబ్బులు పడేస్తే చాలు గెలుపు సునాయసం అనుకున్నాడు. అవే డబ్బులతో చివర వరకు కొట్టుకొచ్చాడు. గెలుపు తీరాలకు చేరేందుకు అన్ని ఫోర్సులు పెట్టాడు. కానీ ఇక్కడ వ్యక్తిత్తమే అతన్ని ఓడించింది. అహంకారమే అతడి పాలిట శాపమైంది. గర్వపు పోకడలే అతన్ని ఓటమిపాలు చేశాయి. మితిమీరిన అతి విశ్వాసం కంటనీరు పెట్టించింది. ఇంటి బాట పట్టించింది.