(దండుగుల శ్రీనివాస్)
వాళ్లిద్దరూ యూట్యూబర్లు. దానితోనే ఫేమస్ అయ్యారు. ఏది పడితే అది వాగడం. ఎంత పడితే అంత మాట్లాడటం. ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియని ఓ ట్రాన్స్ వీరిద్దరిది. ఒకరేమో బీజేపీలో రాష్ట్ర అధికార ప్రతినిధి గిరీశ్ ధారమోని. ఇంకొకరు జర్నలిజం ముసుగులో ఎదిగిన యూట్యూబర్ తీన్మార్ మల్లన్న. వీరిద్దరినీ ఆయా పార్టీలు గెటవుట్ అన్నాయి. చిత్రగుప్త్ పేరుతో గిరీశ్ యూట్యూబ్ నడుపుతున్నాడు.
ఇటీవలే అతన్ని పార్టీ నుంచి తరిమేశారు. ఇతను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫాలోవర్. మొన్నామధ్య బండి సంజయ్, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ల గురించి అనుచితంగా మాట్లాడాడు. వీరి వల్లే పార్టీ భ్రష్టు పట్టిపోతున్నదని, ఎదగలేకపోతున్నదని ఘదాటు కామెంట్లు చేశాడు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్నను కూడా ఇదే విధంగా. వీరిద్దరూ యూట్యూబర్లుగానే ఫేమస్ అయ్యారు.
ఇప్పుడు అదే యూట్యూబ్ వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలు, నోరు జారి… ఇష్టారీతిన వాగి గెటవుట్ అయ్యారు. ఆ రెండు జాతీయ పార్టీల నుంచి. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.