Category: Local News

అర్వింద్‌ రాజకీయానికి ‘బస్వా’ బలి…. జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించిన ఎంపీ… ఏ పదవీ ఇవ్వకుండా ఖాళీగా వదిలేసిన వైనం.. పార్టీ విడిచిపోవాలని పరోక్ష సంకేతం… ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఆశించడం పాపం.. ఢిల్లీ పెద్దలతో సబంధాలు నెరపడం పై అర్వింద్‌ గుస్సా.. తన గుప్పిట్లోనే పార్టీ ఉండేలా ఎత్తులు.. అసమ్మతి నేతల రాజకీయంతో ఆటలు..

దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రాజకీయానికి బడుగు నేత, పద్మశాలి కులానికి చెందిన బస్వా లక్ష్మీనర్సయ్య బలయ్యాడు. ఇన్నేళ్ల అతని రాజకీయ భవిష్యత్తును కాలరాశాడు అర్వింద్‌. దీనికి కారణం పార్టీలో అర్వింద్‌కు ఎదురుతిరగడమే. అసమ్మతిగా పనిచేయడమే. ఎమ్మెల్యే,…

వెంటాడిన దురదృష్టం.. వరుస ఓటమిలతో ‘ సలహాదారు’తో సరి..! షబ్బీర్‌కు ప్రభుత్వ సలహాదారు పదవి.. గెలిస్తే.. మంత్రిగా.. కీలక హోదాలో ఉండేవాడు.. చర్చించుంకుంటున్న పార్టీల నేతలు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: కాలం కలిసి వచ్చింది. కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. కానీ వరుస ఓటమితో కుంగిపోయిన షబ్బీర్‌ను మాత్రం కాలం కనికరించలేదు. ఈ సీనియర్‌ మైనార్టీ నేతను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. కామారెడ్డి నుంచి తప్పుకుని నిజామాబాద్‌ అర్బన్‌…

అలక పాన్పెక్కిన ‘పల్లె’ … జిల్లా అధ్యక్ష పదవి, కిసాన్ మోర్చాకు నో చెప్పేసిన గంగారెడ్డి.. పార్టీ పదవులేనా.. ? నా సీనియారిటీ, త్యాగాన్ని ఎప్పుడు గుర్తిస్తారు.. ?? అధిష్టానం, అర్వింద్‌ తీరుపై పల్లె గంగారెడ్డి గుర్రు.. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పల్లె… నామినేటెడ్‌ పదవీ దక్కకపోవడంపై నైరాశ్యం.. పార్టీ కార్యక్రమాలకూ దూరం దూరం.. పెద్దల ఫోన్లూ ఎత్తని వైనం..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: బీజేపీ సీనియర్‌ లీడర్‌, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పల్లె గంగారెడ్డి అధిష్టానం తీరు, ఇక్కడ ఎంపీ అర్వింద్‌ వైఖరిపై గుర్రుగా ఉన్నాడు. కొద్ది రోజులుగా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఎవరి ఫోన్లకు సకాలంలో…

పనుల ప్రారంభోత్సవాలు…. చెయ్యాలి మళ్లీ మళ్లీ.. ఎన్నికల ముందు ప్రారంభమైన పనుల శిలాఫలాకలను కూల్చేసిన రూరల్‌ కాంగ్రెస్‌ నేతలు.. వీటికే మళ్లీ కొత్త శిలాఫలకాలు.. కొత్త ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేరు.. నేడు రెండోసారి అభివృద్ధి పనుల ఓపెనింగ్‌లు.. ఫౌండేషన్‌ స్టోన్లు.. రూరల్ నియోజకవర్గంలో భూపతిరెడ్డి మార్క్ రాజకీయం.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాజిరెడ్డి గోవర్దన్‌…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌. టెండర్లు పూర్తి చేసి .. అగ్రిమెంట్లు చేసుకుని .. ప్రొటోకాల్‌ ప్రకారం శిలాఫలకాల ఏర్పాటు చేసి పనులు ప్రారంభించేశారు. అవి…

నిజామాబాద్‌ ఎంపీ బరిలో నరేందర్‌రెడ్డి..? బీఆరెస్‌ పరిశీలనలో ప్రముఖ వ్యాపారవేత్త పేరు.. రెడ్డి సామాజికవర్గానికి టికెట్ కేటాయించాలనే డిమాండ్‌ వెనుక సమీకరణలు.. కాంగ్రెస్‌ జీవన్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే.. అందుకు బలమైన ప్రత్యర్థి కోసం వెతుకులాట.. కాంగ్రెస్సే తమకు పోటీ అనుకుంటున్న బీఆరెస్‌… ఈ దిశగా అధిష్టానం సమాలోచనలు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఇందూరు.. ఇప్పుడు మళ్లీ వార్తల్లో కేంద్రబిందువవుతోంది. నిజామాబాద్‌ ఎంపీ బరిలో ఎవరు నిలుస్తారనే చర్చ గత కొద్ది రోజులుగా ఉత్కంఠభరిత…

మంత్రికి రాకేశ్‌రెడ్డి వార్నింగ్‌..! కంట్రోల్‌లో పెట్టకపోతే… చూస్కుందాం…!! వినయ్‌రెడ్డి దాష్టీకాలు ఆపండి… మంత్రికి వార్నింగ్‌ ఇచ్చిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.. ఆర్మూర్‌ లో మూడు పార్టీల మధ్య రచ్చ రాజకీయం…

దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: ఆర్మూర్‌ రచ్చ రాజకీయం రాష్ట్ర వ్యాప్తం చర్చై కూర్చుంది. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పరిణామాలు ఒక్కసారిగా మారాయి. తన ప్రచారంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని మాటలతో…

బంపర్‌ ఆఫర్‌.. మహేశ్‌కు వరించిన ఎమ్మెల్సీ.. ఏఐసీసీ ఆశీస్సులతో చివరి నిమిషంలో జాబితాలో మహేశ్‌ పేరు.. పీసీసీ ప్రెసిడెంట్‌ పక్కా.. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా… ఇక బలమైన బీసీ నేతగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఇందూరు కాంగ్రెస్‌లో జోష్‌..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఇందూరు కాంగ్రెస్‌లో చాలా ఏళ్ల తరువాత కొత్త జోష్‌ వచ్చింది. సీనియర్‌ నేత డీఎస్‌ జమానాలో చాలా ఏళ్లు కాంగ్రెస్‌ హవా నడిచింది. బీసీ నేతగా డీఎస్‌.. ఏఐసీసీ వర్గాలతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు.…

ఇందూరుకు అరుదైన గౌరవం… మహేశ్‌కు ఏఐసీసీ ఆశీస్సులు.. పీసీసీ ప్రెసిడెంట్‌కు ఓకే… పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రకటన.. విధేయతకు, త్యాగానికి దక్కిన గౌరవప్రద ఫలితం.. డీఎస్‌ తర్వాత మళ్లీ ఇందూరు నుంచి మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు అవకాశం.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తజం..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఇందూరుకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. బీసీ నేతగా అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడి విధేయతకు ఏఐసీసీ ఆశీస్సులు లభించడంతో కీలక పదవి దక్కింది. సీనియర్ నేత డీఎస్‌ తరువాత ఇందూరు కాంగ్రెస్‌ నుంచి మహేశ్‌ కుమార్‌…

కవితపై అర్వింద్‌ ఈడీ అస్త్రం.. నోటీసుల పేరుతో మరోసారి తెరపైకి కవిత పేరు తీసుకొచ్చే ప్రయత్నం.. కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున తను హాజరుకాలేనని చెప్పిన కవిత.. నిజామాబాద్‌ బరిలో కవిత పోటీ చేస్తుందనే సంకేతంతో దూకుడుకు కళ్లెం వేసేందుకు అర్వింద్‌ ప్రయత్నం.. బీఆరెఎస్‌ శ్రేణులను డీలా పడేసే ప్లాన్‌..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులిచ్చింది.మంగళవారం హాజరుకావాలని ఆదేశించింది. కానీ కవిత హాజరుకాలేదు. హాజరుకాలేనని తేల్చి చెప్పింది. కేసు సుప్రీం పరిధిలో ఉన్నందున అప్పటి వరకు హాజరుకాలేనని ఈడీకి తెలియజేసింది.…

పార్లమెంటు వ్యూహం.. పండుగ తరువాత పదవుల జాతర.. కాంగ్రెస్‌లో కార్పొరేషన్‌ చైర్మన్ల భర్తీ.. మార్కెట్‌ కమిటీలు కూడా.. ఆశల పల్లకీలో ఇందూరు నేతలు.. ఎవరికి వారే ప్రయత్నాలు… సీనియర్లకు ప్రాధాన్యం.. విధేయతకు పట్టం.. అధిష్టానం కసరత్తు.. ఇక ప్రకటనే తరువాయి..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్‌లో పదవుల పండుగకు తెరలేసింది. సంక్రాంతి తరువాత కార్పొరేషన్‌ పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్దమయ్యింది. సీనియర్లకు, పార్టీ విధేయులకు ప్రధమ ప్రాధన్యతనిచ్చే విధంగా జాబితా రెడీ అవుతుంది. మరో రెండు…