దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులిచ్చింది.మంగళవారం హాజరుకావాలని ఆదేశించింది. కానీ కవిత హాజరుకాలేదు. హాజరుకాలేనని తేల్చి చెప్పింది. కేసు సుప్రీం పరిధిలో ఉన్నందున అప్పటి వరకు హాజరుకాలేనని ఈడీకి తెలియజేసింది. కానీ ఇది ఇప్పుడిది మళ్లీ రాజకీయ చర్చై కూర్చుంది. నిజామాబాద్‌ పార్లమెంటు బరిలో కవిత పోటీ చేసే అవకాశం ఉంది. ఆమే ఉండాలని కూడా పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు.

ఆమె వస్తే పార్టీలో ఊపు వస్తుందని, సిట్టుంగులో ఓటమితో పార్టీ ప్రతిష్ట మసకబారిపోయిందనే ఆవేదనలో పార్టీ శ్రేణులున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో కవిత పోటీ చేస్తే గెలుపు అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఆమె ఎంపీగా గెలిస్తే పార్టీకి పూర్వవైభవం వస్తుందనే ఆశాభావంలో నేతలు, క్యాడర్ ఉంది. ఇప్పుడు మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేయడం.. ఈ దూకుడును దక్కించేందుకేననేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

దీని వెనుక ఎంపీ అర్వింద్‌ ఉన్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడి నుంచి మళ్లీ ఎంపీగా అర్విందే బరిలో ఉండనున్నాడు. అర్వింద్‌పై వ్యక్తిగతంగా పార్టీలో వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. సొంత క్యాడరే ఆయనకు పనిచేసేలా లేదు. మోడీని చూసే ఓటేస్తారనే భ్రమలో అర్వింద్‌ లేడు. ఈ లెక్కన కవిత దూకుడుకు కళ్లెం వేయడంలో భాగంగా ఈడీ అస్త్రాన్ని వాడుకుంటున్నాడనేది రాజకీయాల్లో చర్చకు తెరతీసింది. మరోమారు కవిత పేరును ఈ కేసు ద్వారా గుర్తు చేయడమే లక్ష్యంగా నోటీసుల అస్త్రాన్ని సంధిస్తున్నారనే చర్చ జరుగుతున్నది. అర్వింద్‌ తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా కవితను ఇబ్బంది పెట్టి.. ఎంపీగా పోటీలో తనకు ఎదురులేకుండా చేసుకోవడంలో భాగంగా బలమైన ప్రత్యర్థిగా ఉన్న కవితను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే చర్చ అన్ని రాజకీయ పార్టీల్లో జరుగుతున్నది.

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….