మొండిగానే పోరాడుతా..! బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా తలవంచ..!! బీజేపీ వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుంది..!! ఇలాంటి కేసులకు భయపడేదాన్ని కాదు.. తనపై జరిగిన కుట్రను ప్రజాక్షేత్రంలోనే నిగ్గుతేల్చుతా.. న్యాయ స్థానాలపై నాకు నమ్మకం ఉంది.. న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది.. నేను ధైర్యంగా ఉన్నాను.. నా మనోధైర్యాన్ని నిర్వీర్యం చేయడం బీజేపీ తరం కాదు.. జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత కామెంట్స్…
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కవిత తీహార్ జైలు నుంచి కీలక కామెంట్స్ చేశారు. గతంలో ఆమె పలుమార్లు బెయిల్ నిమిత్తం కోర్టుకు వచ్చిన క్రమంలో తనపై తప్పుడు కేసులు పెట్టారని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మాత్రమే…
