దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి:

కవితకు బెయిల్‌ వస్తుందా…? వస్తుంది. తప్పక వస్తుంది. ఆమె బయటకు రాబోతుంది… ఇప్పుడు ఇవే డిస్కషన్స్‌ ఇందూరు బీఆరెస్‌లో జోరుగా సాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకుంటున్న సందర్బం, కవిత బెయిల్‌పై వాదనల నేపథ్యం.. ఇందూరు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆమె వస్తేనే ఆగమై, అనాథగా మారిన ఇందూరు బీఆరెస్‌లో కొత్త జోష్ వస్తుందని క్యాడర్‌ భావిస్తోంది. ఓ వైపు నాయకులంతా పార్టీని వీడుతుంటే గందరగోళం,అయోమయంతో ఉన్న క్యాడర్‌కు కవిత జైలుకు పోవడం మరింతగా ఇబ్బంది పెడుతోంది.

ఎవరూ పట్టించుకునేవారు లేరు. ఇన్చార్జిలుగా ఉన్న ఓడిన ఎమ్మెల్యేలు పత్తా లేరు. ఉన్న నాయకులను కాపాడుకునే నాయకత్వం లేదు.

ఈ క్రమంలో ఎన్నికల్లో ఎలా పోటీ ఎదుర్కోవాలి..? గెలుపు తీరాలకు చేరుతామా…? అనే డైలామాలో, అనుమానంలో కొట్టాడుతున్న క్యాడర్‌కు కవితే ఇప్పుడు పెద్ద దిక్కు. కానీ ఆమెకు బెయిల్‌ రానీయకుండా గట్టిగానే అడ్డుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో కచ్చితంగా బెయిల్‌ వచ్చి తీరుతుందనే ఆశలు కూడా వారిలో చిగురిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ఆమె ఉంటేనే అర్వింద్‌కు చెక్‌పెట్టొచ్చని భావిస్తున్నారు. కవిత చాలెంజ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఎలాగైనా అర్వింద్‌ను వెంటాడి వెటాడి ఓడిస్తానని కవిత శపథం చేశారు. దీనికి తోడు బీఆరెస్‌ క్యాడర్‌లో నాయకత్వంలో జోష్‌ నింపి.. పూర్వవైభవం తేవాలంటే ఆమె మళ్లీ ఆమె ఇందూరు రాజకీయాల్లో కీలకంగా ఉండాలని భావిస్తున్నారు.

ఇవాళ ఆమె బెయిల్‌ విషయంలో వాదనలు ఉన్నాయి. బెయిల్‌ ఇస్తారా..? మళ్లీ రిమాండ్ పొడిగిస్తారనే విషయంలో తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు బీఆరెస్‌ క్యాడర్.

You missed