అత‌నో క‌బ్జారాయుడు. బ్లాక్‌మెయిల‌ర్‌. సెటిల్‌మెంట్లు చేస్తూ బ‌తికే ఓ లీడ‌ర్‌. పెద్ద‌ల పేరు చెప్పి అక్ర‌మంగా సంపాదించుకునే క్యారెక్ట‌ర్‌. ఇదంతా కోణానికి ఒక‌వైపు. అది తెలియ‌క అత‌నికి జిల్లా ఒలంపిక్ అసోసియేష‌న్‌ను అధ్య‌క్షుడిని చేశారు అప్పుడు. నాలుగేళ్లకోసారి జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు. అంతా తానై వ్య‌వ‌హ‌రించాడు. త‌ను చెప్పిందే వేదం. ఆడిందే ఆట పాడిందే పాటు. దీంతో గంగ‌స్థాన్ వ‌ద్ద ఒలంపిక్ భ‌వ‌న్ కోసం 650 గ‌జాల స్థ‌లం, స్టేడియం కోసం 8 ఎక‌రాలు ప్ర‌భుత్వం కేటాయిస్తే దానిపై ఈ క‌బ్జారాయుడి క‌న్ను ప‌డింది.

ఇందులో రెండుక‌రాల‌కు ఎస‌రు పెట్టాడు. దాన్ని అన్యాక్రాంతం చేయాల‌నుకున్నాడు. ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగి స‌ర్వే చేస్తే పోరాటం చేస్తే గానీ ఈ అక్ర‌మానికి క‌బ్జాకు చెక్ ప‌డ‌లేదు. అంత‌టి ఘ‌న చ‌రిత్ర గ‌లిగిన వ్య‌క్తి … ఆ అధ్య‌క్షుడు గ‌డీల రాములు. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. 13న ఎన్నిక‌లు. బ‌రిలో నిలిచాడు. ఎవ‌రి స‌పోర్టు లేదు. దొంగ సంఘాలను సృస్టించి ఓట్లు వేయించుకోవాల‌నే ఎత్తుగ‌డ‌తో బ‌రిలోకి దిగాడు. బాజిరెడ్డ గోవ‌ర్ద‌న్ ఇత‌ని అక్ర‌మాల‌ను చూసి ఎప్పుడో దూరం పెట్టాడు. దీంతో మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి పంచ‌న చేరాల‌ని చూశాడు.

మంత్రి మెడ‌లు ప‌ట్టుకుని బ‌య‌ట‌కు గెంటేసినంత ప‌నిచేశాడు. దీంతో ఈ కబ్జారాయుడికి దిగ్గు లేక‌, చేసేదేమీ లేక దొంగ సంఘాల స‌భ్యుల ఓట్ల‌ను న‌మ్ముకుని ఎదురీదుతున్నాడు. ఎన్నిక ముందే ఫ‌లితం డిసైడ్ అయ్యింది. ఇప్పుడు ఇత‌నిపై అధ్య‌క్షుడిగా ఈగ సంజీవ‌రెడ్డి, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా బొబ్బిలి న‌ర్స‌య్య‌లు పోటీలో దిగారు. ఈ ప్యాన‌ల్‌కే మ‌ద్దుత భారీగా ఉంది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఇప్పుడు ఈ ఎన్నిక చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మొత్తం ఉన్న‌ది 46 ఓట్లే. ఇందులో ఎవ‌రికెన్ని ప‌డ‌తాయో చూడాలి. గ‌డీల‌ద దాష్టీకానికి, దౌర్జ‌న్యాల‌కు వ్య‌తిరేకంగా క్రీడాసంఘాల‌న్నీ బాజిరెడ్డి ప్యాన‌ల్‌గా ఉన్న సంజీవ‌రెడ్డి, బొబ్బిలి న‌ర్స‌య్య వైపు నిలుస్తున్నారు.

ఎనిమిదేళ్లుగా గ‌డీల రాములు క్రీడాకారుల‌కు చేసిందేమీ లేదు. ఆ ప‌ద‌విని అడ్డుపెట్టుకుని త‌నే అక్ర‌మంగా సంపాదించుకున్నాడు. క్రీడాకారులకు క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌క‌పోగా.. వారిని ప్రోత్స‌హించ‌క‌పోగా… ఆ సంఘానికి చెందిన 12 కోట్ల ప్ర‌భుత్వ భూమికి ఎస‌రు పెట్టేందుకు య‌త్నించిన ఘ‌నుడు గ‌డీల‌కు ఈ ఎన్నిక ఓ చెంప‌పెట్టులాంటి తీర్పు ఇవ్వ‌బోతుంద‌ని క్రీడాకారులంటున్నారు.

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….