గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని విధంగా ఇందూరు ఉమ్మ‌డి జిల్లా మున్నురుకాపు మ‌హిళా లోకం ఒక్క‌టి కాబోతుంది. ఒక్క వేదిక‌పైకి రాబోతుంది. ఒక్క చోట చేరి వ‌న‌భోజ‌నాల వేడుక‌లో పాల్గొన‌బోతున్నారు. దీనికి నిజామాబాద్ జిల్లా కేంద్రం వేదిక కాబోతుండ‌గా…. రాష్ట్ర ఉమెన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్బ‌న్‌, రాష్ట్ర మున్నూరుకాపు మ‌హిళా విభాగం గౌర‌వాధ్య‌క్షురాలు ఆకుల ల‌లిత రాఘ‌వేంద‌ర్ పటేల్ ఈ కార్య‌క్ర‌మానికి సార‌థ్యం వ‌హిస్తున్నారు.

నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున మున్నూరుకాపు మ‌హిళ‌లు ఈ వ‌న భోజ‌న కార్య‌క్ర‌మానికి త‌ర‌లిరానున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లూ పూర్త‌య్యాయి. రేపు (13.11.2022) ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌గ‌తిన‌గ‌ర్‌లోని మున్నూరుకాపు క‌ళ్యాణ మండ‌పంలో ఈ వేడుక నిర్వ‌హిస్తున్నారు. వేదిక‌పై అంతా మ‌హిళ‌లే ఆసీనులు కానునున్నారు. రాజ‌కీయంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మున్నురుకాపు కులానికి ప్రాధాన్య‌త ఇస్తూ వ‌స్తోంది. ఈ వేదిక‌గా త‌మ కుల‌బ‌లాన్ని, త‌మ ఐక్య‌త‌ను చాటుకుని రాజ‌కీయంగా త‌మ స‌త్తా ఏమిటో తెలియ‌జెప్పేందుకు కూడా ఇతోధికంగా ఈ కార్య‌క్ర‌మం ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

ఆ త‌ర్వాత జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని ఆకుల ల‌లిత భావిస్తున్నారు. మంత్రి గుంగుల క‌మ‌లాక‌ర్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఈడీ, ఐటీ దాడుల పేరుతో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్ప‌డుతున్న క్ర‌మంలో ఇప్ప‌టికే ఈ సామాజిక‌వర్గం ఈ కుట్ర‌ను గ‌ట్టిగా తిప్పి కొడుతోంది. ఈ నేప‌త్యం బీజేపీకి బీసీల‌ను మ‌రింత దూరం చేస్తున్న‌ది. అందులో అత్యంత బ‌లంగా ఉన్న మున్నూరు కాపు సామాజిక‌వ‌ర్గం బీజేపీకి పూర్తిగా దూర‌మైన‌ట్టేన‌ని భావిస్తున్నారు. ఈక్ర‌మంలోనే ఇందూరులో ఉమ్మ‌డి జిల్లా మున్నూరుకాపుల వ‌న‌భోజ‌నాల కార్య‌క్ర‌మం నిర్వ‌హించడం ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది.

You missed