హుజురాబాద్ లక్కీ బాయ్స్…
హుజురాబాద్ అందరికీ కలిసివస్తుంది. ఈ ఉప ఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు పండగలా మారింది. ప్రజల కరువు తీరుతున్నది. కడుపు నిండుతున్నది. కరోనా కూడా అంటుతున్నది. కొద్ది మంది నేతలకు మాత్రం అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఎప్పుడూ ఊహించని పదవులు…
ఈటల చలవ.. కేసీఆర్ దయ మా ప్రాప్తం..
మరక మంచిదే. ఓ వ్యాపార ప్రకటనలో ఫేమస్ అయిన డైలాగ్ ఇది. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా అంత ఫేమస్‌గా మారింది. రాష్ట్రమే కాదు..దేశం చూపు కూడా దీనివైపే ఉంది. ఈటల రాజేందర్ పడ్డ మరక ఉప ఎన్నికకు దారితీసింది.…
హుజురాబాద్ ‘ట్రబులే’.. అందుకే రంగంలోకి ‘ట్రబుల్ షూటర్’
ఎన్ని శక్తులను మోహరించినా.. ఇంకా ఏదో అనుమానం. ఎన్ని నిధులు గుమ్మరించినా గెలుపు తీరాలకు చేరమేమో అనే భయం. పదవుల పందేరాలు, పథకాల పరుగులు గట్టెక్కిస్తాయి అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు. చిన్నపామునైనా పెద్ద కట్టెతో కొట్టాలనేది టీఆరెస్ వ్యూహం. కానీ…
దళితుల చుట్టూ పార్టీల పొర్లు దండాలు… కారణమేందో?
కేసీఆర్ మదిలో ఓ ప్లాన్ రూపుదిద్దుకుంటుంది. దాని వెనుక అనేక సమీకరణలు ముడిపడి ఉంటాయి. ఏదీ ఉత్తగనే ఆయన నిర్ణయం తీసుకోడు. ప్రతి దానికీ ఓ అర్థం, పరమార్థం ఉంటాయి. దళిత బంధు కూడా అలాంటిదే. హుజురాబాద్ ఎన్నికల కోసం దాన్ని…
మన నేతలే కరోనా సూపర్ స్ప్రెడర్లు…
రాజకీయం వేడెక్కింది. కరోనా థర్డ్‌వేవ్ పొంచివుందన్న ముప్పు కూడా వెంటాడుతుంది. ఇంకా పూర్తిగా భయం వీడలేదు. ఓ పక్కా కరోనా ఎప్పుడొస్తుందో తెలియక.. బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న జనానికి.. బహిరంగ సభల ఆహ్వానాలు రా రమ్మని పిలుస్తున్నాయి. కరోనా ఎక్కడనో ఆమడ…
సైకో తమ్ముడు.. తండ్రిని చంపారని పగబట్టి పెదనాన్న కొడుకులిద్దరిని చంపిన తమ్ముడు…
చిన్నప్పటి నుంచి పగతో రగిలిపోతున్నాడు. అదును కోసం చూశాడు. ఓ పక్కా స్కెచ్ వేసి సొంత పెదనాన్న కొడుకులిద్దరిని కడతేర్చాడో తమ్ముడు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఈ దారుణం చోటు చేసుకున్నది. బోధన్ పట్టణంలోని బెల్లాల్ చెరువులో ఇద్దరు అన్నదమ్ములు శవాలై…
ఆ రెండు పార్టీల ‘జైలు’ రాజకీయాలు….
ఇంద్రవెల్లి వేదికగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు దుమారం రేపాయి. అధికార పార్టీ నేతలు ఈ మాటల పై స్పందించారు. హుందాగ మాట్లాడాలని, ఇష్టమొచ్చినట్లు నాలుక కోస్తామంటూ గట్టిగానే కౌంటరిచ్చారు. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను జైలుకు పంపుతాను అని తన…
సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత నిర్బంధం, అవమానాలు చూడలేదు.
అతని పేరు కరుణాకర్ దేశాయ్ కేతిరెడ్డి. తెలంగాణ ఉద్యమాలను దగ్గర చూసినవాడు. పాల్గొన్నవాడు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడినవాడు. ఏ పార్టీకి కొమ్ముకాసేదుండదు. తెలంగాణ క్షేమమే ముఖ్యం. ఆత్మాభిమానమే ప్రాణం. ముక్కుసూటిగా మాట్లాడతాడు. తనకు నచ్చింది చెబుతాడు. ఎవరేమనుకున్నా పట్టించుకోడు.…
ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ …!నీకన్నా కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ నయం…!!
Dear RSP, మీరు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడకపోవటమే బెటర్.. సర్వీసులో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి మీరు చేసిన సాయం ఏంటి? వస్తుందో రాదో తెలంగాణ అనుకున్నప్పుడు మీ జాబ్ మీకు ముఖ్యం అయ్యింది. వచ్చిన తెలంగాణలో బహుజనుల జనాభా ఎక్కువ…
కేటీఆర్ గారు..! మీ పత్రికలోనే వందల మంది రోడ్డున పడ్డారు…
రోజూ పొద్దున లేస్తే నమస్తే తెలంగాణ పత్రికలో కేటీఆర్ ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడే ఏదో ఒక వార్త, స్పాట్, స్టోరీ కనిపిస్తుంది పెద్ద పెద్ద అక్షరాలతో. ఆ కంపెనీ వచ్చింది… ఈ సంస్థ వేల కోట్లు పెట్టనుంది.. దీని ద్వారా…
