ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అట్లనే ఉంది కేటీఆర్, హరీశ్ తీరు! ఫోన్లు ట్యాపింగులు చేసింది మీరే.. సమర్థించుకున్నదీ మీరే! ఇప్పుడు సిట్‌ను తప్పుబడుతూ.. పోలీసులను బెదిరిస్తూ..!
(దండుగుల శ్రీనివాస్) ఓడిపోయినా ఇంకా బుద్ది మారలేదు. ప్రజలు గుణపాఠం చెప్పినా ఇంకా అహం దిగలేదు. అవే బెదిరింపు మాటలు. అహంకార పూరిత కామెంట్లు. ఐఏఎస్‌లను వదలరు. ఐపీఎస్‌లనూ విడవరు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్,…
కేఆర్ సురేశ్‌రెడ్డి… వారసుడొస్తున్నాడు! కొడుకును ఆర్మూర్ బరి నుంచి ఎంట్రీకి తండ్రి సుముఖత..
(దండుగుల శ్రీనివాస్) సీనియర్ లీడర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి .. తన వారసత్వాన్ని రాజకీయాల్లోకి దింపుతున్నాడు. ఆయన తన కొడుకు అమిత్‌రెడ్డిని ఆర్మూర్ బరి నుంచి దింపేందుకు .. ఇక్కడి నుంచి రాజకీయ ఆరంగేట్రం చేపించేందుకు పావులు కదుపుతున్నాడు. ఇప్పటికే…
ఇందూరుతో ముగిసిన హెచ్. గంగారం బంధం! పేరెన్నికగన్న వస్త్ర వ్యాపారానికి ముగింపు!!
(దండుగుల శ్రీనివాస్) హెచ్. గంగారం అంటే అందరికీ గుర్తొచ్చేది నిజామాబాద్. నిజామాబాద్ అంటే హెచ్. గంగారాం… హెచ్. గంగారమంటే నిజామాబాద్… అలా ఉండేది దీని పేరు. ఆ పేరే ఓ బ్రాండ్. నిజామాబాద్‌తో దశాబ్దాల చరిత్ర దానికి. ఇక్కడి ఇందూరు ప్రజలతో…
ఆఫ్ ది రికార్డ్ పేరుతో అక్రమ సంబంధాలంటగడితే …. ఇట్లనే ఉంటది మరి! తీటగాళ్లకు పోటుగాడు..సజ్జనార్! మీడియా విచ్చలవిడితనంపై విరుచుకుపడ్డ సిట్!! సోషల్ మీడియాలో ఏది బడితే అది రాస్తే ఇకపై చెల్లదు! కేటీఆర్ అధికారులను బెదిరిస్తాడు… ఆయన మీడియా బ్యాచ్ రెచ్చిపోతుంది! దారితప్పిన మీడియాను అదుపులోకి తేవాల్సిందే!!
(దండుగుల శ్రీనివాస్) బరిబాతల ఊరిగే ఉన్న ఇజ్జత్ తీసుకున్నది మీడియా. ఏది చేసినా చెల్లుతుందనే ముసుగులో.. అక్రమసంబంధాలను అంటగట్టి మరీ దిగజారి పాతాళానికి పడిపోయింది. అందుకే ఇలా నడిరోడ్డులో బరిబాతల నిలబడి పరువు తీసుకున్నది. ఇప్పుడు ఈ మీడియాకు సపోర్టు దక్కలేదు.…
జిల్లాలు తగ్గయ్… స్వరూపాలు మారుతాయ్! ఉన్న జిల్లాలను తగ్గించే ఆలోచన సర్కార్‌కు లేదు!! దీన్ని రాజకీయం చేసేందుకు రెడీ అయిన బీఆరెస్.. సాంకేతికంగా ఇబ్బందులు పడుతున్న చోట.. ప్రజాభీష్టం మేరకు మార్పులు.. మండలాలు, రెవెన్యూ డివిజన్ల నైసర్గిక స్వరూపాలపైనే సర్కార్ నజర్..! ఉన్న జిల్లాలు అట్లనే ఉంచి… అవసరమైతే మరో జిల్లా పెంచినా ఆశ్చర్యపోనవసరం లేదు.. ఉద్యోగుల కోసం మల్టీజోన్‌లలో మార్పులు అవసరం..
(దండుగుల శ్రీనివాస్) సీఎం ఏం మాట్లాడినా దాన్ని నెగిటివ్ కంటెంట్‌లో ప్రజెంట్ చేసి రాజకీయ లబ్ది కోసం బీఆరెస్ తెగ పాకులాడుతోంది. తాజాగా ఆ పార్టీకి దొరికిన అంశం జిల్లాల విభజన. రేవంత్‌రెడ్డి అన్నది… జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదు… కొన్ని…
స్టాక్ మార్కెట్లో సైబర్ దొంగలు..! సైబర్ ముఠా వలలో జేడీ విలవిల!! నకిలీ వెబ్‌సైట్లు, నకిలీ కంపెనీలు, నకిలీ వాట్సాప్ గ్రూపు.. కొంపముంచుతున్న అతి తెలివి, అత్యాశ!
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) ఊరంతా శకునం చెప్పిన బల్లి కుడితిలో పడిందన్న చందాన్ని తలపిస్తుంది… సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్న హై లిటరేట్లు, మేథావులను చూస్తుంటే. అతి తెలివి, అత్యాశ గలవారు సైబర్ క్రిమినల్స్ వలలో పడి కోట్లు పోగొట్టుకుంటున్నారు.…
అప్పుడు డీఎస్.. ఇప్పుడు కేసీఆర్! వెంటాడిన వారసత్వ పోరు! చరమాంకంలో మిగిలిన మానసిక క్షోభ!
(దండుగుల శ్రీనివాస్) బీఆరెస్‌లో కవిత వేరు కుంపటి తరవాత ఇప్పుడు రాజకీయాల్లో తెరపైకి వచ్చిన అంశం వారసత్వ పోరు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం.. ఇందిరాగాంధీ నుంచి ఎన్టీఆర్ వరకు కూడా ఈ వారసత్వ పోరు తప్పలేదని. ఇప్పుడు మనం డీఎస్…
ఇందూరు గులాబీల్లో గుబులు! కవిత తిరుగుబాటుతో ఇంచార్జిలకు పెరిగిన టెన్షన్!! ఇంచార్జిలుగా ఉందామా? ఉంటే గెలుస్తామా? కవిత బతకిస్తుందా?? కేసీఆర్ మళ్లీ మనకే ఛాన్స్ ఇస్తాడని గ్యారెంటీ ఏందీ? మరెందుకు మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి?? అంతర్మథనంలో గులాబీల శిబిరం
(దండుగుల శ్రీనివాస్) తనను ఓడించింది సొంత గూటి వాళ్లే. అంటే .. ఇందూరు బీఆరెస్ ఎమ్మెల్యేలు. ఎవరు వాళ్లు..? అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న బిగాల గణేశ్ గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్, బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే…
పరివార్.. నాడు ఇందిర.. నేడు కేసీఆర్.. మధ్యలో ఎన్టీయార్! నాడు మేనక.. నేడు కవిత! కవితపై ప్రతి విమర్శ చేయొద్దు .. కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు!
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) అనాదిగా రాజకీయ వారసత్వం కోసం పరివారంలో పొలిటికల్ పవర్ వార్ దేశ, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. అంతఃపుర కలహాలు మహానేతలను సైతం బజారుకీడ్చాయి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ , మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొదలుకొని…
ఇది అక్క పలుకు… ఆ కుటుంబ పార్టీ పరువు! బీఆరెస్ భక్షక పార్టీ… రక్షక పార్టీ కాదు! తెలంగాణను దోచుకుని.. అప్పులకుప్ప చేసి..!! జనం నమ్మకాన్ని వమ్ము చేసిన కేసీఆర్ అండ్ టీమ్! కవిత ఖుల్లం ఖుల్లాగా బాగోతం బటయపెట్టిన తరువాత జనానికి పిచ్చ క్లారిటీ! కొంతమందిలో ఉన్న అపోహలు, భ్రమలు ఇక పటాపంచలు..
(దండుగుల శ్రీనివాస్) ఎన్నో అపోహలు, అనుమానాలకు చెక్ పెట్టింది కవిత. మరెన్నో భ్రమలకు, అపనమ్మకాలకు క్లారిటీ ఇచ్చేసిందామె. అవును.. ఎవరో చెబితే నమ్మకపోయేదేమో ఇంకొన్ని రోజుల పాటు. కానీ ఆ ఇంటి ఆడపడుచే బాహాటంగా బయటకు వచ్చి చెప్పింది. ఉన్నదున్నట్టుగా, నిక్కచ్చిగా,…
