(దండుగుల శ్రీనివాస్)
ఎన్నో అపోహలు, అనుమానాలకు చెక్ పెట్టింది కవిత. మరెన్నో భ్రమలకు, అపనమ్మకాలకు క్లారిటీ ఇచ్చేసిందామె. అవును.. ఎవరో చెబితే నమ్మకపోయేదేమో ఇంకొన్ని రోజుల పాటు. కానీ ఆ ఇంటి ఆడపడుచే బాహాటంగా బయటకు వచ్చి చెప్పింది. ఉన్నదున్నట్టుగా, నిక్కచ్చిగా, నిజాయితీగా. మొన్నటి వరకు తెలంగాణ జనంలో కొంత అపోహ ఉండేది ఇంకా. ఏమని? కేసీఆర్ జాతిపిత. ఆ పార్టీ తెలంగాణకు రక్ష. ఆయనే తెలంగాణ తెచ్చాడు. తెచ్చాడు కాబట్టి ఇక్కడి ప్రజల యోగక్షేమాలే ఆయనకు పరమావధి. అంతకు మించి ఆయనకు ఎలాంటా రాజకీయ ఆకాంక్ష లేదు. స్వలాభం అసలే లేదు. స్వార్థం లేని మనిషి. తెలంగాణ జాతి కోసం కొట్లాడే పోరాట యోధుడు.
ఇవన్నీ ఇవన్నీ నిన్నటి వరకు . ఆ భ్రమలన్నింటినీ బద్దలు కొట్టేసింది కవిత. ఆ ఇంటి ఆడపడుచునే అంతలా రాచి రంపాన పెట్టి.. ఆత్మ గౌరవం దెబ్బతీసి.. మెడపట్టి బయటకు గెంటేసిన ఆ బాపులో మరో కోణం ఏందో స్పష్టంగా అర్థమైపోయింది జనానికి ఇవాళ. ఆ పార్టీ తెలంగాణ రక్షణ పార్టీ కాదు. రక్షించే పార్టీ కాదు. భక్షించే పార్టీనేనని. గద్దల్లా తెలంగాణను పీక్కుతున్న కుటుంబం అది. అందినకాడికి దోచుకుని తెలంగాణను అప్పుల పాలు చేసి క్రుంగదీసిన బేకార్‌గాళ్ల పార్ట అది. ఇది నేనంటున్నది కాదు. ఆ కుటుంబ సభ్యురాలే చెప్పింది. సభా ముఖంగా. కంటతడి పెట్టి మరీ. అందుకే జనానికి ఎవరేంటో అర్థమైపోయింది. క్లారిటీగా. ఇంక నో డౌట్స్. స్పష్టత వచ్చింది. కచ్చితంగా చైతన్యం అయ్యింది తెలంగాణ జనం.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
