(దండుగుల శ్రీనివాస్)
ఓడిపోయినా ఇంకా బుద్ది మారలేదు. ప్రజలు గుణపాఠం చెప్పినా ఇంకా అహం దిగలేదు. అవే బెదిరింపు మాటలు. అహంకార పూరిత కామెంట్లు. ఐఏఎస్‌లను వదలరు. ఐపీఎస్‌లనూ విడవరు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్, హరీవ్‌రావు …ఇప్పుడు దాన్నే సమర్థించుకుంటున్నారు. తప్పన్నవారిని దునుమాడుతున్నారు. బెదిరిస్తున్నారు. మేమే మళ్లా వచ్చేది..మిమ్మల్ని చూసుకుంటాం.. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు.. అనేలా తీవ్ర అహాన్ని ప్రదర్శించడం.. వీరిని జనం ముందు మరీ పలుచనే చేస్తుంది. ఓడగొట్టి మంచి పనే చేశాం రా.. వీరిక మారరు.. అని గట్టిగానే తీర్మానించుకునేలా చేస్తున్నది వీరి ప్రవర్తన.
ఫోన్ ట్యాపింగు చేసింది వాస్తవమేనని చాలా వేదికల మీద ఒప్పుకున్నాడు కేటీఆర్. అవును.. కొంత మంది లంగలు, దొంగల ఫోన్లు వింటుంది సర్కార్.. అది సర్కార్‌కు ముప్పు వచ్చేలా ఉంటుందనే అనుమానంతో చేస్తుంది.. ఇదులో తప్పేం ఉంది… మాకు సంబంధం ఏముంది? అనేలా సమర్థించుకున్నాడు కేటీఆర్. కానీ మీరు అన్న ఆ లంగలు, దొంగలు.. మొత్తం ప్రతిపక్ష నాయకులే కదా.. అంతా .. వీరు వారు కాదు.. సినీ తారల దాకా. అంత అనుమానమెందుకు? అంత దూలెందుకు? అందరి ఫోన్లు వినాలనే తీటెందుకు? ఇది నేరం కాదా? దీనిపైనే కదా సిట్ వేసింది. చేసింది మీరే.. సమర్థించుకుంటున్నదీ మీరే. పైగా మళ్లీ బెదిరింపులు. మీ అంతు తేలుస్తామని. అంటే మీరేం చేసినా అది బంగారు తెలంగాణ కోసమని జనం అనుకోవాలా? మీకు చట్టాలు వర్తించవా? నేరాలకు మీకు శిక్షలు పడొద్దా..? ఇదేమైనా దొరల పాలనా? ఇంకా మారరా.. మారండ్రా…. అని అంటున్నారు జనమంతా.

Dandugula Srinivas
Senior Journalist
