Category: Local News

vastavam digital news paper, 28-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

కొలువులిచ్చేందుకు ఇందూరుకు క్యూ కట్టిన బడా కంపెనీలు… 29న మెగా జాబ్‌మేళా… కవిత చొరవతో 35 కంపెనీలలో కొలువులు… పదో తరగతి నుంచి ఉన్నత చదవుల అభ్యర్థుల వరకు అంతా అర్హులే… కొలువుల భర్తీ నిరంతర ప్రక్రియగా మార్చిన కవితక్కకు ధన్యవాదాలు….…

కొలువులిచ్చేందుకు ఇందూరుకు క్యూ కట్టిన బడా కంపెనీలు… 29న మెగా జాబ్‌మేళా… కవిత చొరవతో 35 కంపెనీలలో కొలువులు… పదో తరగతి నుంచి ఉన్నత చదవుల అభ్యర్థుల వరకు అంతా అర్హులే… కొలువుల భర్తీ నిరంతర ప్రక్రియగా మార్చిన కవితక్కకు ధన్యవాదాలు…. భూమారెడ్డి కన్వన్షన్‌ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు… ఇందూరు ఐటీ హబ్‌తో పాటు హైదరాబాద్‌లో మంచి వేతనాలతో పెద్ద కొలువులు…. ఆర్టీసీ చైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి… మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన బాజిరెడ్డి జగన్‌….

ఇప్పటికే ఒక మెగాజాబ్‌ మేళాను నిర్వహించి విజయవంతం చేసిన తరహాలోనే ఈనెల 29న కూడా ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో, ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు తైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒలంపిక్‌ సంఘం…

రైతు నేత దివంగత వేముల సురేందర్‌రెడ్డికి ఘన నివాళులు… తండ్రి ఆశయసాధనలో ముందుకు సాగుతున్నా…: మంత్రి ప్రశాంత్‌రెడ్డి…

వేల్పూర్: రైతు నాయకుడు, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,పలువురు రైతు నాయకులు,అభిమానులు ఘన నివాళి అర్పించారు. వేల్పూర్ లోని స్వర్గీయ సురేందర్ రెడ్డి…

ఎమ్మెల్యేగా పోటీకి వెనుకంజ…. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం… ఆర్మూర్‌ నుంచి రాకేశ్‌కే ఓకే… అనధికారికంగా మీటింగులో ప్రకటించేసుకున్న రాకేశ్‌రెడ్డి…. కోరుట్ల నుంచి కూడా పోటీ డౌటే… అర్వింద్‌ పోటీపై పార్టీ శ్రేణుల్లో అయోమయం…

ఎన్నో ఊహాగానాలు.. ఆర్మూర్‌ నుంచి అర్విందే పోటీ చేస్తాడని. కానీ ఆ ప్రచారానికి తెర దించాడు రాకేశ్‌రెడ్డి. పార్టీలో ఇటీవల చేసిన రాకేశ్‌రెడ్డి ఆర్మూర్‌ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. కానీ అర్విందే బరిలో ఉంటాడనే ప్రచారం నిన్నటి వరకు సాగింది. దీంతో…

కవిత కామారెడ్డి సభ వాయిదా…. త్వరలో తేదీ ప్రకటన… కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బహిరంగ పెట్టాలని నిర్ణయం… గంప గోవర్దన్‌ తనయుడి వివాహం తర్వాతే ఉండే అవకాశం…

కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో తొలిసారి స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ నేతృత్వంలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బీబీపేటలో 28 (సోమవారం) సభ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ దీన్ని వాయిదా వేసినట్టు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌…

vastavam digital news paper, 27-08-2023, breaking news, www.vastavam.in

నమస్తే తెలంగాణ విలేకరిని బెదిరించిన బీజేపీ నేత… తప్పుడు వార్తలు రాసేకన్నా నా దగ్గర జీతం ఉండు… ఆర్మూర్ నుంచి బీజేపీ అభ్యర్థిని నేనే… కవిత ప్రశ్నకు బదులిచ్చిన బీజేపీ నేత రాకేశ్‌రెడ్డి…… దోస్త్‌ మేరా దోస్త్‌….. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌…

నమస్తే తెలంగాణ విలేకరిని బెదిరించిన బీజేపీ నేత… తప్పుడు వార్తలు రాసేకన్నా నా దగ్గర జీతం ఉండు…

కామారెడ్డి బీజేపీ నేత కాట్‌పల్లి వెంకటరమణారెడ్డి నమస్తే తెలంగాణ విలేకరిపై విరుచుకుపడ్డాడు. బెదిరించాడు. తనతో పెట్టుకుంటే తడాఖా చూపిస్తానన్నాడు. జాగ్రత్తరరేయ్‌ అని కూడా వార్నింగ్‌ ఇచ్చాడు. అసలు విషయం ఏంటంటే…. కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడనే అంశంపై తనొకటి మాట్లాడితే…

ఆర్మూర్ నుంచి బీజేపీ అభ్యర్థిని నేనే… కవిత ప్రశ్నకు బదులిచ్చిన బీజేపీ నేత రాకేశ్‌రెడ్డి……

.ఆర్మూర్‌ నుంచి తమ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డిని నిలబెడుతున్నామని, ఇతర పార్టీలు ఇంకా తమ అభ్యర్థులనే ప్రకటించలేకపోతున్నాయని ఎమ్మెల్సీ కవిత వేసిన ప్రశ్నకు బీజేపీ నేత పైడి రాకేశ్‌రెడ్డి బదులిచ్చాడు. ఆర్మూర్‌ బీజేపీ నుంచి తనే అభ్యర్థిగా నిలబడుతున్నానని, గెలవబోతున్నానంటూ వ్యాఖ్యానించాడు.…

దోస్త్‌ మేరా దోస్త్‌….. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌ దాకా… ఆర్మూర్‌ నుంచి రాజేందర్‌కు కాంగ్రెస్ టికెట్‌ ఇప్పించేందుకు ఈరవత్రి అనిల్‌ మధ్యవర్తిత్వం… వినయ్‌రెడ్డికి మానాల మోహన్‌రెడ్డి అండ… ఇద్దరు బీసీలు.. ఇద్దరు రెడ్ల మధ్య కాంగ్రెస్‌లో పోరు…

ప్రజారాజ్యం పార్టీ వారి బంధాన్ని కలిపింది. స్నేహబంధంగా ఏర్పడింది. ఈరవత్రి అనిల్‌… గోర్త రాజేందర్‌. వీరిద్దరూ అప్పట్నుంచి ఇప్పటి దాకా స్నేహితులు. బాల్కొండ నుంచి పీఆర్పీ నుంచి టికెట్‌ తీసుకుని గెలిచిన ఈరవత్రి అనిల్ ఇప్పుడు ఆర్మూర్‌ కాంగ్రెస్‌ నుంచి గోర్త…

ఏ-1 ఆర్మూర్‌… నెంబర్‌ వన్‌ జీవన్‌రెడ్డి… జీవన్‌ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత… ఉద్యమ పార్టీతో విడదీయరాని సంబంధం ఉన్న విషయాన్ని యాది చేస్తూ జీవన్‌ను ప్రశంసించిన కవిత.. 60 వేల మెజారిటీతో మూడో సారి జీవన్ రెడ్డిని గెలిపించాలి ఆర్మూర్ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

అక్షర క్రమంలో ముందున్న ఆర్మూర్‌ లాగే.. జీవన్‌ కూడా అన్నింటా నెంబర్‌వన్‌గా ఉన్నాడని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. శుక్రవారం ఆయన టికెట్‌ కన్ఫాం అయిన తర్వాతా నియోజకవర్గానికి వస్తున్న రాక నేపథ్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరై ప్రసంగించారు. జీవన్…