కామారెడ్డి బీజేపీ నేత కాట్‌పల్లి వెంకటరమణారెడ్డి నమస్తే తెలంగాణ విలేకరిపై విరుచుకుపడ్డాడు. బెదిరించాడు. తనతో పెట్టుకుంటే తడాఖా చూపిస్తానన్నాడు. జాగ్రత్తరరేయ్‌ అని కూడా వార్నింగ్‌ ఇచ్చాడు. అసలు విషయం ఏంటంటే…. కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడనే అంశంపై తనొకటి మాట్లాడితే నమస్తే తెలంగాణ విలేకరి మరొకటి వక్రీకరించి రాశాడనేది వివాదమయ్యింది. దీంతో ఇవాళ ఓ మీటింగులో నమస్తే తెలంగాణ విలేకరిపై విరుచుకుపడ్డాడు రమణారెడ్డి. జీతం రాళ్ల కోసమే నీవిలా తప్పుడు వార్తలు రాస్తే.. రా .. నా దగ్గర జీతం పెట్టుకుంటా.. అని కూడా నోరుపారేసుకున్నాడు. ఇలా ఉంది ప్రస్తుత రాజకీయాల పరిస్థితి. విలేకరులకు లీడర్లు ఇచ్చే మర్యాద. బహిరంగంగానే నోరు పారేసుకునే ఇలాంటి నేతలు టిప్పర్లతో గుద్దించి చంపినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు జనం..

వాస్తవం ఏంటంటే నమస్తే తెలంగాణ విలేకరి ఆ వార్తను వక్రీకరించి రాశాడు. కానీ బీజేపీ లీడర్‌ మాటలు అంతకన్నా వక్రంగా ఉన్నాయి మరి. ఇలాంటి నేతలు రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే.. ఏం చేస్తారో.. మరి

You missed