.ఆర్మూర్‌ నుంచి తమ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డిని నిలబెడుతున్నామని, ఇతర పార్టీలు ఇంకా తమ అభ్యర్థులనే ప్రకటించలేకపోతున్నాయని ఎమ్మెల్సీ కవిత వేసిన ప్రశ్నకు బీజేపీ నేత పైడి రాకేశ్‌రెడ్డి బదులిచ్చాడు. ఆర్మూర్‌ బీజేపీ నుంచి తనే అభ్యర్థిగా నిలబడుతున్నానని, గెలవబోతున్నానంటూ వ్యాఖ్యానించాడు. ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమంలో బాగంగా మాక్లుర్ మండల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి బాపురవు రావడం జరిగింది.

ఈ సమావేశంలో ఆర్మూర్ బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిన్న నిర్వహించిన ర్యాలీ చివరి ర్యాలీ అని వ్యాఖ్యానించారు. ఒక్క సారి అవకాశం ఇవ్వాలని, రౌడీ ఎమ్మెల్యే ని ఒడిస్తాను అని రౌడీలను,కబ్జాలకు కేరాఫ్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సురేష్ నాయక్, జిల్లా అధ్యక్షుడు బాస్వా నర్సయ్య,పలేపు రాజు,కార్యవర్గ సభ్యుడు పల్లె గంగారెడ్డి,అలపుర్ శ్రీనివాస్,నుతూల శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు

You missed