కోట్ల రూపాయలు గూటికి చేరాల్సి ఉంది. మునుగోడు చుట్టూ అవి ఇప్పటికే డంపింగ్ అయి ఉన్నాయి. వాటిని అదును చూసి మునుగోడుకు చేర్చాలని బీజేపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న ప్రభుత్వం వీటిని పట్టుకునేందుకు పకడ్బందీ చెకింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ కోట్ల రూపాయలు ఇప్పుడు అష్టదిగ్బంధనంలో ఉన్నాయి. పోలింగ్‌కు సరిగ్గా ఒకటి రెండు రోజుల ముందు అవి అక్కడికి చేరాలి. లేదంటే కొంప మునుగుతుంది. ఇప్పిటికే కోటి ఒకసారి, కోటి మరోసారి అమౌంట్ పోలీసులకు పట్టుబడ్డాయి.
ఎల్బీనగర్, భువనగిరి, దేవరకొండ, మాడ్గుల, ఇబ్రహీంపట్నం నియోజవకర్గాల పరిధిలో బీజేపీ కోట్లాది రూపాయలను డంప్ చేసిందని ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. మునుగోడు చుట్టే కేంద్రీకృతమై ఉన్న డబ్బంతా ఇప్పుడు సెంటర్‌కు చేర్చాలి. పోలీసులకు పట్టుబడొద్దు. చెకింగ్ చేతికి చిక్కొద్దు. ఇప్పుడిదే పెద్ద చిక్కు వచ్చిపడింది బీజేపీకి. మంత్రులు, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు తప్ప ఈ డబ్బును సేఫ్టీగా లోనికి తీసుకెళ్లలేని పరిస్థితులు క్రియేట్ అయి ఉన్నాయి. ఎన్నిక ప్రచారానికి చివరి రోజుల్లో ఢిల్లీ పెద్దల హడావుడి ఎలాగూ ఉండనే ఉంటుంది. ఆ కాన్వాయ్‌లో నైతే పెద్దగా పట్టింపు ఉండదనే ఆలోచనలో కాషాయదళం ఉన్నట్టు తెలుస్తోంది.