ఏవి డ్రామాలు… ? ఏవి నిజాలు..?
ఎవ‌రిని న‌మ్మాలి..? ఎవ‌రు చెప్పింది వినాలి..??

జ్వ‌రం నిజ‌మేనా…? అనారోగ్యం వాస్త‌వ‌మేనా…??

ఇది సానుభూతి కోస‌మా..? వాళ్ల‌కిది అల‌వాటేనా..??

ఓట‌ర్ల సానుభూతి కోస‌మా..? ఓట్లు రాల్చుకునేందుకేనా…??

పాపం ..! బీజేపీ ప‌రిస్థితి ఇలా త‌యార‌య్యింది. గ‌త అనుభ‌వాల‌ను, డ్రామాల‌ను దృష్టిలో పెట్టుకుని .. ఇప్పుడు రాజ‌గోపాల్ రెడ్డితో ఆడుకుంటున్నారు. అత‌ని జ్వ‌రం వ‌చ్చింద‌ట‌. రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇదీ వార్త‌. అంతే…! టీఆరెస్ సోష‌ల్ మీడియా, నెటిజ‌న్లు దీన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇగ డ్రామాలు షురూ చేసిండ్రా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మీకు ఇది అల‌వాటే … అంటూ గ‌తంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ అభ్య‌ర్థుల అనుభ‌వాల‌ను, ఫోటోల‌ను బ‌య‌ట‌పెట్టి .. ఇది కూడా అందులో భాగ‌మే అంటున్నారు. పాపం పాడుగాను..!! అంత‌గానం తిరుగుతుండు.. నోరు నొప్పి పెట్టేట‌ట్టు ఒర్రుతుండు.. మ‌ధ్య మ‌ధ్య‌న బెదిరిస్తున్న‌డు. తంతా.. సంపుతా అంటూ గొంతు చించుకుంటుండు. ఇంత చేస్తే ఓ చిన్న జ్వ‌రం రాక‌పోత‌దా..? నిజంగ‌నే వ‌చ్చింది కావొచ్చు. కానీ వీళ్లు న‌మ్మేలా లేరు. అది నిజం జ్వ‌రం కాదు.. డ్రామానే అంటున్నారు. ఈ దెబ్బ‌కు రాజ‌గోపాల్ రెడ్డి నిజంగా జ్వ‌రం వ‌చ్చినా… డోలో ట్యాబెట్లు జేబులో పెట్టుకుని రోడ్డెక్కి ప్ర‌చారం చేయాల్సిందే. అప్ప‌టి దాకా వీళ్లు వ‌దిలేలా లేరు. అలా త‌యార‌య్యింది ప‌రిస్థితి.

చిన్న‌ప్పుడు అయ్యా పులి వ‌చ్చే క‌థ‌లా ఉంది క‌దా ఇ ది…! ఎవ‌డో డ్రామా ఆడాడేమో … అంతే అది అంద‌రికీ వ‌ర్తింప‌జేస్తున్నారు. ఓ ర‌కంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో అనారోగ్యం, ఆక్సిడెంట్‌, కాలు బెనుకుడు.. ఇవ‌న్నీ బీజేపీకి పేటెంట్ హ‌క్కుల్లా మారాయి. ఇగో ఇదే ప్ర‌చారం చేస్తున్నారు టీఆరెసోళ్లు.. నిజంగా అదే డ్రామా ఇదైతే .. ఇప్ప‌టికీ దాన్నే ప్ర‌యోగించాల‌ని చూస్తే .. ఇది మ‌రీ పిటీ క‌దా..ఇగ మ‌రీ పాత చింత‌కాయ ప‌చ్చ‌డి ఐడియా అయిందిది కానీ, కొత్త‌దేదో ఒక‌టి ఆలోచించుండ్రి…

You missed