ధర్నాచౌక్ . తెలంగాణ రాకముందు అందరి బాధలు చెప్పుకునేందుకు, ఉద్యమాలు చేసేందుకు వేదిక. డిమాండ్లు చెప్పేందుకు దీక్షాస్థలం. కానీ తెలంగాణ వచ్చినంక. కేసీఆర్‌ను తిట్టుడే పనా..? అసలు ప్రాణాలకొడ్డి కేసీఆర్ తెలంగాణ తెచ్చింది మీ అసొంటి అడ్డమైన వాళ్లతో తిట్లుతినేందుకా..? లేచినోడు లెవనోడు కేసీఆర్‌ను తిట్టుడేనా..? మైకు చేతికొస్తే చాలు కేసీఆర్‌ను వరుసపెట్టి తిట్టాలె. అప్పుడే వాడు మంచి వక్త అన్నట్టు. అందుకేనా మీకీ ధర్నాచౌక్. అసలు మీరు ఉద్యమకారులెందుకైతర్రా బై. తెలంగాణ వచ్చే వరకే ఉద్యమాలు. తెలంగాణ సాధించినంక కూడా ఉద్యమాలా..? బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ ఎంత శ్రమకోరుస్తున్నడె చూస్తలేరా..? కళ్లు లేవా… మరి ఇప్పుడు కూడా అవే వేశాలు వేసి మేం ఉద్యమాలు చేస్తం.. ధర్నా చౌక్ కాడ టెంట్లేస్తం.. కేసీఆర్‌ను పొట్టు పొట్టు తిడతం.. ఇదేనా మీ పద్దతి.
అసలు ధర్నా అంటే ఎట్లా ఉండాలి. దారి పరమార్థం ఎమై ఉండాలి.
ఇగో నిన్న కేసీఆర్ చేసిన మహాధర్నా చూసి నేర్చుకోండ్రి. ఊకే ఊకదంపుడు ఉపన్యాసాలు, కేసీఆర్‌ను తిట్టుడు ఇవి కాదు ధర్నా అంటే.
మీరిట్ల చేస్తుండ్రనే కేసీఆర్‌కు తిక్కరేగి ఆడ ధర్నా చౌక్ లేదు గిర్నా చౌక్ లేదు అన్నది.
దాన్నీ రచ్చ రచ్చ చేసిండ్రు. ఇప్పుడు దాన్ని ధర్నా చౌక్ అనొద్దు. ఇందిరాపార్క్ కాడా ధర్నా అని అనాలె.
అసలు ధర్నాలు చేసేందుకు ఓ స్పెషల్ జాగా కావాల్నా.. ఏడవడితే ఆడ చేసుకోండ్రి. ఈడికొచ్చి మరీ.. అడ్డపెట్టి మరీ టెంట్లు వేసుకుని మరీ .. మైకులు మార్చి మార్చి మరి.. తిట్లు ఏమార్చి మరీ మరీ తిట్టడమేనా..
అందుకే కేసీఆర్ మీకు ధర్నాలెలా చేయాలో చూపేందుకు నిన్న మహాధర్నా చేసిండు.
ఒక్కదెబ్బకు రెండు పిట్టలు. అటు మోడీ దిగొచ్చిండు. ఇటు స్టేట్ బీజేపీకి ఉచ్చపడ్డది.
అంతే కదా సవాల్‌రెడ్డి రావు దొర…….
కానీ వరి వేసుకోవాలో వద్దో … మహాధర్నా ఉద్దేశం నెరవేరిందో లేదో చెప్పలే దొరా…