రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం-30
“నా మైండ్ కాదు…. నీ మైండ్ దొబ్బింది. ఆ ఆటో రవిగాడితో నీ పెళ్లాం అక్రమ సంబంధం పెట్టుకున్నదని ఊరంతా కోడై కూస్తున్నది. ఆ విషయం నీకు మాత్రం తెలియదు “అన్నది. తన కోపాన్నంత మాటల ద్వారా చూపిస్తున్నదామె. “ఆటో రవితో…….”…
News you can trust
“నా మైండ్ కాదు…. నీ మైండ్ దొబ్బింది. ఆ ఆటో రవిగాడితో నీ పెళ్లాం అక్రమ సంబంధం పెట్టుకున్నదని ఊరంతా కోడై కూస్తున్నది. ఆ విషయం నీకు మాత్రం తెలియదు “అన్నది. తన కోపాన్నంత మాటల ద్వారా చూపిస్తున్నదామె. “ఆటో రవితో…….”…
అప్పటికే సరోజా గేటు దాటి వెళ్లిపోయింది. “మీ అన్న వచ్చే టైం అయ్యింది.” ఈ మాటలను ఒత్తి మరీ పలికింది లక్ష్మి. రాజారెడ్డి ఆ మాటల్లో ఆంతర్యాన్ని గుర్తించాలన్నట్లుగా. అది గ్రహించాడు రాజారెడ్డి. కోపం చల్లారింది. “ఎవరెటు పోతే నీకెందుకు?” అంతరంగం…
నోట్ల వాసన మత్తుగా తగిలింది ముక్కు పుటాలకు. వాసన పీల్చుకున్నాడు కళ్లు మూసుకుని. గమ్మత్తుగా వుందావాసన. చేతివేళ్లకు నాలికతో పదన చేసుకొని నోట్లను లెక్కించసాగాడు. మూడు.. నాలుగు…. ఐదు వేలు.. లెక్కించడం పూర్తయినా…… ఒక నోటు ఇంకా చేతిలో మిగిలి ఉంది.…
“ఏమంటున్నారు ఆఫీసులో?” అన్నాడు రాజారెడ్డి. “ఏముంది? అదే టార్గెట్లు ఏమయ్యాయి? ఎంత చేశావు? దసరాకు ఎన్ని యాడ్స్ చేస్తావు? రేపు మీటింగు ఉంది పైసలు తీసుకొని రండి.. గివే ముచ్చట్లు” అన్నాడు. వింటున్నాడు రాజారెడ్డి. “వీడు రూపాయి ఇచ్చేది ఉండదు. జీతగాళ్లలెక్క…
“వాడెవడి గురించో నువ్వు రెచ్చిపోయి పిచ్చిపట్టినట్టుగా ఆ చేష్టలేందిరా నాయన?” అన్నది. దానికి భయంగా ఉంది రాజారెడ్డి ప్రవర్తన చూసి. “ఎవడెటు పోతే నీకెందుకు? ఏమైపోతే నీకెందుకు?” అన్నది. ఈ ఏదో అందామని నోరు తెరవబోయాడు. తల పై కట్టిన బొప్పి…
గబగబా పక్క గదిలోకి వెళ్లి డోర్ వేసేసుకున్నది భార్య. రాజారెడ్డి మానసిక స్థితిని అంచనా వేసుకున్నది. తనను చితకబాదుతాడనే అనుమానం వచ్చిందామెకు. భార్య డోర్ పెట్టుకునే సరికి బయటకు నడిచాడు. చేతులు కడుక్కొని గేటు వద్ద నిలబడ్డాడు. కడుపు కాలిపోతుంది. ఓ…
తలకొట్టేసినంత పనైంది రాజారెడ్డికి. ముఖం ఎర్రగా కందగడ్డలా మారింది. విసురుగా అక్కడ్నుంచి వచ్చేశాడు. చెట్టుకింద తన కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ‘ఏమైంది?” అన్నట్లు ముఖం పెట్టాడు. “సారు చాలా బిజీగా ఉన్నాడట. క్యాంపు ఆఫీసుల కలుస్తడంట” అన్నాడు రాజారెడ్డి వ్యంగ్యంగా. “నేను…
దసరా వచ్చిందంటే భక్తి ప్రపత్తులతో దుర్గామాత పూజల్లో లీనమవుతారు భక్తులు. మాలధారణ వేసి 9 రోజులు నిష్టగా పూజలు చేస్తూ దుర్గామాత మందిరం సన్నిధిలోనే సేద తీరుతారు. భక్తిలో మునిగితేలుతారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్మీర్‌కర్ గోపాల్ మాత్రం పనే దైవం…
అప్పుడే ఇంటి బయట బైక్ ఆగిన చప్పుడు వచ్చింది. “ఎవరా?” అని చూశాడు. విజయ్. తమాయించుకొని కూర్చున్నాడు. లోపలికి వచ్చిన విజయ్ “హాయ్” అని పలకరించాడు. “ఎలా ఉన్నావు రెడ్డి ?” అని అడిగాడు. ముఖాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. అప్పటికే ఆలోచనలతో…
జర్నలిస్టులు నలుగురు చనిపోయారని కనీసం అసెంబ్లీ సాక్షిగానైనా చర్చకు వచ్చింది సంతోషం. ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చిత్తశుద్దితోనే ఉందట. కానీ మేనేజ్‌మెంట్లే వారి ఉసురు తీస్తున్నాయట. పాపం ఈ క్రాంతి అంతుకుమించి కూడా ఏం మాట్లాడలేడు. ఇంతమటుకు మాట్లాడింటంటేనే గ్రేటు. గ్రేటున్నర.…