జ‌ర్న‌లిస్టులు న‌లుగురు చ‌నిపోయార‌ని క‌నీసం అసెంబ్లీ సాక్షిగానైనా చ‌ర్చ‌కు వ‌చ్చింది సంతోషం. ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల చిత్త‌శుద్దితోనే ఉంద‌ట‌. కానీ మేనేజ్‌మెంట్లే వారి ఉసురు తీస్తున్నాయ‌ట‌. పాపం ఈ క్రాంతి అంతుకుమించి కూడా ఏం మాట్లాడ‌లేడు. ఇంత‌మ‌టుకు మాట్లాడింటంటేనే గ్రేటు. గ్రేటున్న‌ర‌. మెచ్చుకోవాల్సిందే. కానీ న‌మ‌స్తే తెలంగాణ పేప‌ర్ ఎవ‌రిది అధ్య‌క్షా..? క‌రోనా పేరు చెప్పి ఎన్ని వంద‌ల మందిని రోడ్డు పాలు చేశారాధ్య‌క్ష‌? చెరువులో దుంకి చ‌నిపోయిన తూఫ్రాన్ రూర‌ల్ రిపోర్ట‌ర్ సీహెచ్ నాగ‌రాజు .. న‌మ‌స్తే తెలంగాణ రిపోర్ట‌రే అధ్య‌క్ష‌.. అత‌ను ఎందుకు చ‌నిపోయాడో మీకు తెల‌వ‌నిది కాద‌ధ్య‌క్షా..?

కానీ మ‌న ప్ర‌భుత్వం చిత్తుశుద్దితోనే ప‌నిచేస్తున్న‌ద‌ధ్య‌క్ష జ‌ర్న‌లిస్టుల సంక్షేమానికి. కానీ కానీ ఆ మేనేమ్‌మెంట్లే అట్ల చేస్తున్నాయి అధ్య‌క్ష‌. ఇక‌నైనా మీరు దీనిపై ఏదో ఒక‌టి.. ఏదైనా ఒక‌టి… ఏదోలా చేసి .. మ‌రేదైనా ఆలోచించి.. ఎలాగోలా చేసి.. ఎలాగోలా ఏదైనా చేసి.. మ‌రేమైనా చేసి. ఇంకేదైనా మ‌రేదైనా… ఏదో ఒక‌టైనా.. ఇంకేదో మ‌రేదో అయినా.. చేసి ప‌రిష్కారం చూపాల‌ధ్య‌క్షా..?