ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి తన శత్రువులను ఎలా మట్టుబెట్టాలో తెలుసు. తను అనుకున్నాడంటే అవతలి వ్యక్తి ఎంతటి బలవంతుడైనా తను పథకం వేశాడంటే మట్టి కరవాల్సిందే. తను అనుకున్నది సాధించే వరకు, అనుకున్న పని అయ్యేంత వరకు వదలిపెట్టడు. అంతటి శక్తిశాలిని ఓ సర్పంచ్ భర్త చంపేందుకు యత్నించడమా..? ఇది నమ్మశక్యమా..? ఇది నిజంగా కుట్రేనా..? లేదా పథకం ప్రకారమే జరిగిందా..?
ఇప్పుడు నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశం చర్చకు తెర తీసింది. జీవన్‌రెడ్డికి ప్రభుత్వంలోని పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. తన అనుకున్నాడంటే ఆ పని అయ్యేంత వరకు వదిలిపెట్టడు. ఎన్నికల సమయంలోనైతే ప్రతిపక్షాలు కనీసం ఊహించని విధంగా తన శత్రువులను కూడా ఆలింగనం చేసుకుని తనకు అనుకూలంగా మలుచుకునే నేర్పరి. అంతటి శక్తియుక్తులున్న జీవన్‌రెడ్డిని ఓ అర్బకుడు చంపేంత సీన్ ఉందా? అనేది ఇప్పుడిక్కడ చర్చకు తెరతీసింది. జిల్లా రాజకీయాల్లో ఇప్పుడీ సంఘటన దుమారం రేపుతోంది.