Month: December 2024

రాజ‌కీయం రాజ‌కీయ‌మే…! స‌న్మానం స‌న్మాన‌మే..!! ఇక్క‌డింతే ఇక్క‌డింతే…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పేకాట పేకాటే.. బామ్మ‌ర్ది బామ్మ‌ర్దే…!! ఇది తెలంగాణ‌లో ఓ సామెత‌. అంద‌రికీ తెలిసిన ఊత‌ప‌దం. నానుడి. ఇప్పుడిది ఎందుకూ అంటారా..! ఢిల్లీలో మ‌న సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డికి స‌న్మానం చేశాడు. గౌర‌వంగా…

కారు కొనుక్కుంటే ఆటాడుకున్నారు..! కోదండ‌రామ్‌పై విరుచుకుప‌డ్డ బీఆరెస్ సోష‌ల్ మీడియా..!! ఇదెక్క‌డి క‌డుపు మంట‌రా నాయ‌నా..!! విస్తుపోయిన నెటిజ‌న్లు..! అంటే ఆయ‌న కారుకొనుక్కునే స్థోమ‌త కూడా లేదా..!! మ‌రీ ఇంత‌లా దిగ‌జారీ పోయార్రేంట్రా…. మీ కేటీఆర్‌లా…!! కామెంట్ల‌పై జ‌నాల విస్మ‌యం…

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాపం.. బీఆరెస్ సోష‌ల్ మీడియా టీమ్‌కు… ఆ పార్టీ సింప‌తైజ‌ర్ల‌కు అజీర్తి జ‌బ్బు చేసి వాంతుల మీద వాంతులు చేసుకుంటున్నారు. ఎంత‌లా అంటే…. కోదండ‌రాం కారు కొనుకున్న వ‌ద‌ల‌డం లేదు. ఓ ప్రొఫెస‌ర్‌… రాజ‌కీయాల్లో ఉన్నాడు. ఎమ్మెల్సీ. ఓ…

రైతుల చేతికి బేడీలు… బీఆరెస్‌ను న‌ట్టేట ముంచాయి…| ఇప్పుడు అదే అస్త్రం కాంగ్రెస్‌పైకి కేటీఆర్‌…! రేవంత్ ఈ ఇష్యూపై సీరియ‌స్‌… ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌నను వ‌ద‌ల‌ని బీఆరెస్‌…! స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసే య‌త్నంలో దూకుడు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుడు బీఆరెస్‌ను కొంప ముంచిన ఘ‌ట‌న‌..ఇప్పుడు కాంగ్రెస్ మెడ‌కు చుట్టే య‌త్నం చేస్తోంది బీఆరెస్‌. ఖ‌మ్మం మిర్చీ రైతుల‌కు బేడీలు వేసిన ఘ‌ట‌న అప్ప‌ట్లో క‌ల‌క‌రం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై కేసీఆర్ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. దీని…

ర‌చ‌యితలు, ఉద్య‌మ‌కారుల‌కు కేటీఆర్ న‌మ‌స్తే…! రచ‌యిత‌ల సంఘం మీటింగుకు ప్ర‌యార్టీ ఇవ్వ‌ని బీఆరెస్ క‌ర‌ప‌త్రిక‌..! తెలంగాణ‌త‌ల్లి విగ్ర‌హ మార్పుపై ఐడియాల‌జీ వార్ న‌డిచినా పెద్ద‌గా ప‌ట్టించుకోని కేటీఆర్‌..! ఇప్ప‌టికీ బుద్ది మార‌ని కేటీఆర్‌, కేసీఆర్‌… మండిప‌డుతున్న ర‌చ‌యితలు, ఉద్య‌మ‌కారులు..!! నెల‌కు కోట్లు గుమ్మ‌రిస్తున్న బీఆరెస్ సోష‌ల్ మీడియా కూడా ప‌ట్టించుకోని వైనం..! ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌కూ ప‌ట్ట‌లేదు..! ర‌చ‌యిత‌లు, ఉద్య‌మ‌కారుల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ మార్పు పై బీఆరెస్ మండిపడుతోంది. వాట్సాప్ డీపీలు, ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్‌లు మార్చేసుకుని పాత తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ప్ర‌తిమ‌ను పెట్టుకోవాల‌ని కేటీఆర్ ఆదేశించాడు. ఇదో ఉద్య‌మంలా తీసుకుపోతున్నామ‌ని బిల్డ‌ప్ ఇచ్చాడు. కానీ ఇదే…

స‌రిపోయారు ఇద్ద‌రూనూ…!! గురుతులు చెరుపుతూ ఒక‌రు..! వాటిని గ‌ల్లంతు చేస్తామ‌ని శ‌ప‌థం మ‌రొక‌రు..!! అధికారంలోకి రాగానే…! కేటీఆర్ నోటి వెంట ప‌దే ప‌దే ఈ మాటే..!! మీ నుంచి జ‌నాలు కోరుకున్న‌ది ఈ శ‌ప‌థాలు, ఈ మార్పులు కావు..!! రాహుల్ గాంధీ లేఖ‌లో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ కేటీఆర్ డొల్ల మాట‌లు…

స‌రిపోయారు ఇద్ద‌రూనూ…!! గురుతులు చెరుపుతూ ఒక‌రు..! వాటిని గ‌ల్లంతు చేస్తామ‌ని శ‌ప‌థం మ‌రొక‌రు..!! అధికారంలోకి రాగానే…! కేటీఆర్ నోటి వెంట ప‌దే ప‌దే ఈ మాటే..!! అప్పుడే ఏడాదైంది…. కొంచెం ఓపిక ప‌ట్టండి యువ‌రాజా…!! విగ్ర‌హాల‌ను గాంధీభ‌వ‌న్‌కు త‌ర‌లిస్తాం… ఓకే గానీ……

నువ్వు సీఎం అయ్యే సీన్ లేదా కేటీఆర్‌…! వంద సీట్లు గెలుస్తాం.. మ‌ళ్లీ కేసీఆర్ సీఎం….!! ఇవే మాట‌లే గానీ…! రేవంత్ క‌న్నా నేనే బెట‌ర్ సీఎంగా పాలిస్తాన‌ని చెప్పుకోలేవా..?? అంటే.. నిన్ను జ‌నాలు సీఎం పీస్‌గా చూడ‌టం లేదా..?? పాపం… కేటీఆర్‌…! సీఎం ప‌ద‌వి ఇక త‌న‌కు క‌లేన‌న్న‌ట్టు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇవాళ కేటీఆర్ మ‌ళ్లీ అదే మాట మాట్లాడాడు. మేమే అధికారంలోకి వ‌స్తామ‌న్నాడు. పాత డైలాగే. వంద సీట్లు ఖాయ‌మ‌న్నాడు. చింత‌కాయ ప‌చ్చ‌డి మాట‌లే. మ‌ళ్లీ సీఎం కేసీఆరేన‌న్నాడు. ఇదీ రొటీన్ రొడ్డ‌కొట్టుడు డైలాగే. కానీ ప‌దే ప‌దే కేసీఆర్…

కొండంత రాగం తీసి…!! నీ దిశానిర్దేశం ఇదేనా కేసీఆర్‌…! అసెంబ్లీ స‌మావేశాల బీఆరెస్ వ్యూహం అట్ట‌ర్ ఫ్లాప్‌..!! బీఆరెస్ తెలంగాణ త‌ల్లి రూపంతో టీ ష‌ర్టులెందుకు వేసుకోలేదు….!!

(దండుగుల శ్రీ‌నివాస్ ) అసెంబ్లీ స‌మావేశాల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాలి..? ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి..?? అని వ్యూహ ప్ర‌తివ్యూహాలు ప‌న్నిన మాజీ సీఎం కేసీఆర్ … ప్లానింగ్ తుస్సుమ‌న్న‌ది. తొలి రోజే కేటీఆర్ అండ్ టీమ్ అనుస‌రించిన వ్యూహం తిప్పికొట్టింది. అట్ట‌ర్…

సీఎం రేవంత్ క‌న్నా మంత్రి సీత‌క్కే న‌యం..!! తెలంగాణ త‌ల్లి శిల్పం మార్పు పై క్లారిటీగా మాట్లాడిన మంత్రి…! అది క‌విత న‌మూన‌గా రూపుదిద్దార‌ని కుండ‌బ‌ద్ద‌లు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అసెంబ్లీ స‌మావేశాల సాక్షిగా ప‌చ్చి అబ‌ద్దాలు చెప్పాడు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ త‌ల్లి కొత్త విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించే స‌మ‌యంలో ఆయ‌న అసెంబ్లీ సాక్షిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా మ‌ట్లాడ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఏదైనా సూటిగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు…