(దండుగుల శ్రీనివాస్)
పేకాట పేకాటే.. బామ్మర్ది బామ్మర్దే…!! ఇది తెలంగాణలో ఓ సామెత. అందరికీ తెలిసిన ఊతపదం. నానుడి. ఇప్పుడిది ఎందుకూ అంటారా..! ఢిల్లీలో మన సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సన్మానం చేశాడు. గౌరవంగా సత్కరించాడు. మర్యాదగా పెద్దరికంగా సన్మానం చేశాడు. అయితే … ఇప్పుడిదంతా ఎందుకు సోదీ..! అరే జర్ర ఆగుండ్రి బై. మొన్ననే అంతకు మొన్ననే కదా.. నువ్వో గుజరాత్ గులామ్ కిషన్‌రెడ్డి.. నువ్వు మూసీలో పడి చచ్చినా మూసీ పునరుజ్జీవం ఆపను.. !అని పచ్చి బూతులు అందుకున్నది. తిట్టి పోసింది. దుమ్మెత్తి పోసింది. మూసీ నీళ్లు నెత్తిమీద పోసింది. కావొచ్చు.
అయితే..! అయితే అంటరేందిబై. మరిప్పుడు ఈ సన్మానం ఎట్లా చేస్తుండు..! అసలు మనసు వచ్చిందా..! మనస్పూర్తిగా చేసిండా..! ఏ ఊకో..! ఏ జమానలా ఉన్నవ్. అదంతే అప్పుడు ఓ రాజకీయం. ఇప్పుడు అవసరాల రాజకీయం. అంతా తెలంగాణ కోసమే. ఏందీ..! మన కేసీఆర్ అన్నట్టు.. ఏదీ చేసినా తెలంగాణ కోసమే అంటవా..! ఔ మరి కాదా..!! కానీ ఇక్కడో పాయింట్ గమనించావా తమ్మీ..! ఏందే అన్నా..!! కేసీఆర్ తిట్టి మళ్లా ఆళ్లతో సచ్చినా మాట్లాడకపోయేదీ..! కానీ మన రేవంతు అవేమీ మనసులో పెట్టుకోడే. తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ఎక్కువ పనిచేస్తన్న సీఎం అని ఇప్పటికైనా నమ్ముతవా నమ్మవా..! నమ్మక చస్తానా…! అంతా టైం బీయింగ్..! కామ్ గోయింగ్..!! అంతేగా.. అంతేగా…!!