(దండుగుల శ్రీ‌నివాస్ )

అసెంబ్లీ స‌మావేశాల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాలి..? ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి..?? అని వ్యూహ ప్ర‌తివ్యూహాలు ప‌న్నిన మాజీ సీఎం కేసీఆర్ … ప్లానింగ్ తుస్సుమ‌న్న‌ది. తొలి రోజే కేటీఆర్ అండ్ టీమ్ అనుస‌రించిన వ్యూహం తిప్పికొట్టింది. అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. అదానీతో రేవంత్ దోస్తానా గురించి టీ ష‌ర్టులు ధ‌రించి అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. టీ ష‌ర్టులు తొల‌గించి వెళ్లాల‌ని ష‌ర‌తు పెట్టారు. అసెంబ్లీ బ‌య‌టే గొడ‌వ గొడ‌వ చేసి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఈ అదానీ వ్య‌వ‌హారం జనాల‌కు ఎంత మందికి తెలుసు కేసీఆర్‌.. కేటీఆర్‌..! ఇదేనా మీ వ్యూహం…!

కొండంత రాగం తీసి.. ఏదో అన్న‌ట్టు.. ఫామ్‌హౌజ్‌లో మీటింగు పెట్టి ఇక మీకు టైం లేదు.. టైం ఇచ్చినం.. మీ అంతు చూస్తామ‌ని.. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ రూపు రేఖ‌లు మార్చ‌డం మూర్ఖ‌త్వమ‌ని ఏదేదో మాట్లాడిన కేసీఆర్‌… ఇచ్చిన చతుర‌తతో కూడిన వ్యూహం అసెంబ్లీ సాక్షిగా బొక్క‌బోర్లా ప‌డ్ద‌ది. తొలిరోజు అసెంబ్లీ లో చ‌ర్చ జ‌రిగేది తెలంగాణ త‌ల్లి కొత్త శిల్పం ఆవిష్క‌ర‌ణ గురించి. ఆ టీష‌ర్టుల‌పై మీ తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఏర్పాటు చేసుకొని వ‌చ్చినా బాగుండేది. ఆ అదానీ ఇష్యూ ఎవ‌డికి కావాలి..? జనానికి ఏం అర్థ‌మ‌య్యింది…? అయినా.. ఆ అదానీ ఇచ్చిన వంద కోట్లు రిట‌ర్న్ ఇచ్చేశాడు. అప్ప‌టి వ‌ర‌కు ప‌దేళ్లుగా అధికారంలో ఉన్న‌ది మీరేనాయే. ఉంటేగింటే… మేఘా క్రిష్టారెడ్డితో ఉన్న‌ట్టుగా అదానీతో కూడా మీకే మాం.. చి సంబంధాలు ఉండి ఉంటాయి.

దీనిపై అంత రాద్దాంతం చేయాల‌ని చూసి బొక్క బోర్లా ప‌డ‌టం త‌ప్ప చేసిందేమైనా ఉందా..? ఇది చాల‌దంటూ కేటీఆర్ అక్క‌డ అసెంబ్లీ ముందు మాట్లాడుతూ… ల‌గ‌చ‌ర్ల భూసేక‌ర‌ణ అంశంపై నిర‌సిస్తూ అన్నాడు. మీరే ల‌గ‌చ‌ర్ల భూసేక‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది… అది మా విజ‌య‌మే… అని సంబ‌రాలు కూడా చేసుకున్నారు. మ‌ళ్లీ ల‌గ‌చ‌ర్ల అంశం ఎందుకొచ్చింది. మీకు మీరే క‌దా ఆ అంశాన్ని క్లోజ్ చేసి ఇంక మారు మాట్లాడ‌కుండా చేసుకుని బొక్క బోర్లా ప‌డ్డ‌ది. ఇలా ఇంకెన్ని సార్లు బొక్క‌బోర్లా ప‌డ‌తారు కేసీఆర్ అండ్ కేటీఆర్ టీం….

You missed