(దండుగుల శ్రీనివాస్)
పాపం.. బీఆరెస్ సోషల్ మీడియా టీమ్‌కు… ఆ పార్టీ సింపతైజర్లకు అజీర్తి జబ్బు చేసి వాంతుల మీద వాంతులు చేసుకుంటున్నారు. ఎంతలా అంటే…. కోదండరాం కారు కొనుకున్న వదలడం లేదు. ఓ ప్రొఫెసర్… రాజకీయాల్లో ఉన్నాడు. ఎమ్మెల్సీ. ఓ కారు కూడా సొంతంగా కొనుక్కోలేడా..? మరీ ఇంతలా ట్రోలింగ్ చేయాలా…? బట్టకాల్చి మీదేసే యవ్వాసం కాస్త బాగానే వంట బట్టించుకున్నారు మనోళ్లు. మామూలు కామెంట్లు కాదు అవి. పాపం పెద్ద మనిషి గుండె గట్టిది కాకపోతే ఆత్మహత్యే చేసుకోవాలి. అంతలా తిట్టిపోశారు సోషల్ మీడియాలో. కేటీఆర్‌లా మీకూ ఫ్రస్ట్రేషన్ పీకల నుంచి కపాలంలోకి ఎక్కిందిరోయ్…!
మీరిలా పనికిరాని విషయాలకు కూడా అతిగా స్పందిస్తే పట్టించుకోరు నాయన..! అయ్యా పులి మాదిరిగా.. అసలైన సమయంలో నిజ్జంగా మీ స్పందన బాగుంటే బాగు బాగు అంటారు. లేదంటే బేవార్సుగాళ్లు అని బీఆరెస్ సోషల్ మీడియాకు బిరుదిలిచ్చేయగలర్రోయ్….! జర జాగర్త. అదే కోదండరామ్ .. కేసీఆర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగితే ఎన్ని కార్లు కొన్నా.. ఎన్ని బిల్డింగులు కట్టినా… ఎంత ఆస్తి సంపాదించినా మీకు ఓకే కదరా బడవాయ్‌లు…! ఎందుకురా ఇలా తయారయ్యారు..! ఇవన్నీ నేను తిట్టడం లేదురోయ్ సన్నాసుల్లారా..! కామన్ పబ్లిక్ అనుకుంటున్నారు. అంతే.
ఇప్పుడు మీరంతా ఓ ట్రాన్స్‌లో ఉన్నారు. మీకెన్ని చెప్పినా.. ఎందరెక్కినా పట్టదనుకో… అది కూడా అందరికీ తెలిసిపోయింది కానీ… కేటీఆర్ దగ్గర మార్కుల కోసం ఇలా దిగజారి, బరిబాతల నిలబడి సిగ్గులేదురా.. అని మందిని తిట్టడం జర ఆపండ్రా బాబు..! మీకు పుణ్యముంటది…!!