(దండుగుల శ్రీనివాస్)
ఇవాళ కేటీఆర్ మళ్లీ అదే మాట మాట్లాడాడు. మేమే అధికారంలోకి వస్తామన్నాడు. పాత డైలాగే. వంద సీట్లు ఖాయమన్నాడు. చింతకాయ పచ్చడి మాటలే. మళ్లీ సీఎం కేసీఆరేనన్నాడు. ఇదీ రొటీన్ రొడ్డకొట్టుడు డైలాగే. కానీ పదే పదే కేసీఆర్ సీఎం .. కేసీఆర్ సీఎం.. అంటున్నావ్.. నీవు సీఎం కావా..? రాబోయే రోజుల్లో నేనే సీఎం అని కాలర్ ఎగురేసుకుని చెప్పే దైర్యం లేదా..? చెబితే ప్రజలు యాక్ థూ అని చీదరించుకుంటారని భయమా..? అభద్రతా భావమా..? భయంతో కూడిన పిరికితనంతో మేళవించిన ఇన్విరియారిటీ కాంప్లెక్స్‌తో కలగలిపిన ఎస్కిపిజమా..? కేసీఆర్ పేరు చెబితేనే జనాలు అంతో ఇంతో కనికరిస్తారనే సంకుచితత్వమా..? ఎలాగో కేసీఆర్ సీఎం అయితే తాను మళ్లీ షాడో సీఎంగా కొనసాగవచ్చనే సంబరమా..?
ఎందుకు పదే పదే ఈ డవిలాగు వాడి తనకు తాను మరింత దిగజార్చుకుంటున్నాడో పాపం. కేసీఆర్ జనాల మీద అలిగి ఫామ్ హౌజ్‌కే పరిమితమైన పిచ్చోడి చేతిలో రాయిలా పార్టీ పగ్గాలు కేటీఆర్‌కు అప్పగించడం తప్పైంది. ఇగో ఇలా ఎప్పుడు ఏది వాగుతున్నాడో కేటీఆర్‌కే తెలియడం లేదు. సోషల్ మీడియాను నెలకు కోట్లకు కోట్లిచ్చి మేపుతూ వారు చెప్పింది పోస్టు చేస్తూ.. వాగుతూ ఇలా జనాల ముందు మరింత చులకైనతున్నాడు.