దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అధికార పార్టీలోకి వలసలు కామనే. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది మాత్రం రొటీన్‌కు భిన్నం. ఎంపీ క్యాండిడేట్‌గా ప్రకటించిన తరువాత పార్టీని వదలి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అదీ అందులోను కేసీఆర్‌కు మరీ దగ్గరగా ఉన్న దళితమేధావి కడియం శ్రీహరి లాంటి వాళ్లు. ఆయన కూతరు క్యావ్యకు వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చినా.. కాదని వదిలేసి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారిద్దరు. ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావనార్హం. పోతూ పోతూ కడియం ఓ లేఖ రాశాడు. అవినీతి అక్రమాలపై ప్రస్తావించాడు.

ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్నీ గుర్తు చేసి ప్రశ్నించాడు.లిక్కర్‌ స్కాంపై నిలదీశాడు. ఇలా ధైర్యం చేసి మాట్లాడింది ఎవరూ లేరు. ఇదంతా ఇలా ఉంటే సోషల్‌ మీడియాలో పార్టీ అభిమాని అనుగు సీతారాం రెడ్డి ఓ పన్నెండు లోపాలను కేసీఆర్‌, కేటీఆర్‌లకు వివరిస్తూ ఓ పోస్టు పెట్టాడు. ఇది అందరూ అంగీకరించే విధంగానే ఉంది. కానీ వారిద్దరూ ఒప్పుకోరు. మారరు. మేమింతే అంటారు. అది వేరే విషయం. పార్టీ ఇంకా అడుగుకు కాదు కాదు పాతాళానికి పడిపోయినా ఇప్పుడప్పుడే వీరిద్దరూ మారేలా లేరు. ఆ పన్నెండు లోపాలు వీరిద్దరి వ్యవహార శైలిని వెక్కిరిస్తున్నాయి. అవీ ఇవీ..

> నేల విడిచి సాము చేయడం
> వాపును చూసి బలుపు అనుకోవడం
> ప్రజాస్వామ్యాన్ని పాతరేయడం
> నేను చెప్పిందే వేదం అనే నియంతృత్వ పోకడ
> పార్టీ మూల సిద్ధాంతాన్ని పక్కన పెట్టడం
> లక్షల సభ్యత్వాలు చూసి ఊహల్లో విహరించడం
> కిందిస్థాయి నాయకులను కార్యకర్తలను విస్మరించడం
> పార్టీలో చెప్పేదానికి ప్రభుత్వంలో చేసే దానికి తేడా ఉండడం
> సలహాలు సూచనలు ఇచ్చే నాయకులంటే నచ్చకపోవడం
> నిజాయితీపరులను బయటికి పంపించడం భజన చేసేటోన్ని పక్కన పెట్టుకోవడం
> మనం సృష్టించిన పెయిడ్ బ్యాచ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూసి ఉబ్బి తబ్బిబ్బు అవ్వడం
> అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజలు మిమ్మల్ని బండకేసి కొట్టిన ఇంకా మీరు మారకపోవడం…….

ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుంటారని భావిస్తున్న

✍️
సీతన్న

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed