దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇద్దరూ ఇద్దరే..! ఇదేదో పాజిటివ్ క్యాప్సన్ అనుకునేరు. అహంకారినికి ఈ ఇద్దరు ప్రతిరూపాలు. అధికారదాహానికి పరాకాష్టలు. ఆత్మవంచనకు ప్రతీకలు. అసమర్థులకు కేరాఫ్ అడ్రస్‌లు. సమర్థించు్కోవడంలో తీస్మార్‌ఖాన్‌లు..! లోపాలు ఎత్తిచూపితే అగ్గిబరాటాలు. జోకుడు గాండ్లకు గాడ్‌ఫాదర్‌లు.. ఇంకా చాలనే ఉన్నాయి గానీ, నేను ఎవరి గురించి చెబుతున్నానో అర్థమయే ఉంటది ఈపాటికే. అదేనండి.. ఓ కేసీఆరూ.. ఓ కేటీయారు.. అసలు విషయం ఏందంటే సోషల్ మీడియాలో ఓ పోస్టు తెగ వైరల్ అవుతుందబ్బా. ఆ పోస్టు పెట్టింది హార్డ్ కోర్ బీఆరెస్ అభిమానే. ఏమన్నాడు. నిజం చెప్పాడు. నిజం మనవాళ్లకు మింగుడపడదు కదా. కానీ ఈ పన్నెండు లోపాలు పార్టీలకతీతంగా ఔను నిజమే అనిపించాయి. ఇప్పుడంతా ఇదే డిస్కషన్. వాస్తవంలో రాసిన ఇదే వార్త ఇప్పుడు వైరల్. పార్టీ ఇంకా అడుగుకు కాదు కాదు పాతాళానికి పడిపోయినా ఇప్పుడప్పుడే వీరిద్దరూ మారేలా లేరు. ఆ పన్నెండు లోపాలు వీరిద్దరి వ్యవహార శైలిని వెక్కిరిస్తున్నాయి. అవీ ఇవీ..
> నేల విడిచి సాము చేయడం
> వాపును చూసి బలుపు అనుకోవడం
> ప్రజాస్వామ్యాన్ని పాతరేయడం
> నేను చెప్పిందే వేదం అనే నియంతృత్వ పోకడ
> పార్టీ మూల సిద్ధాంతాన్ని పక్కన పెట్టడం
> లక్షల సభ్యత్వాలు చూసి ఊహల్లో విహరించడం
> కిందిస్థాయి నాయకులను కార్యకర్తలను విస్మరించడం
> పార్టీలో చెప్పేదానికి ప్రభుత్వంలో చేసే దానికి తేడా ఉండడం
> సలహాలు సూచనలు ఇచ్చే నాయకులంటే నచ్చకపోవడం
> నిజాయితీపరులను బయటికి పంపించడం భజన చేసేటోన్ని పక్కన పెట్టుకోవడం
> మనం సృష్టించిన పెయిడ్ బ్యాచ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూసి ఉబ్బి తబ్బిబ్బు అవ్వడం
> అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజలు మిమ్మల్ని బండకేసి కొట్టిన ఇంకా మీరు మారకపోవడం…….
ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుంటారని భావిస్తున్న
✍️
సీతన్న