వాస్తవం – ప్రత్యేక ప్రతినిధి:

నిను వీడని నీడను నేనే.. అన్నట్టు కవిత వెంట పడుతున్నాడు మోడీ. కవితను అరెస్ట్‌ చేసి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రూట్‌ క్లియర్‌ చేసుకున్న మోడీ.. ఇంకా ఆమెను వదలడం లేదు. తాజాగా మాదాపూర్‌లో కవిత భర్త అనిల్‌ సోదరి అఖిల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారు. కవిత వ్యాపారాలకు అనిల్‌ బినామీ. తెర వెనుక ఉండి నడిపించేది అంతా ఆయనే అనే కోణంలో ఈడీ నజర్‌ పెట్టింది. ఇప్పుడు అనిల్‌ను టార్గెట్ చేసింది ఈడీ. కవితను అరెస్ట్‌ చేసి కేసీఆర్‌, బీఆరెస్‌కు తీవ్ర నష్టాన్ని కలిగించిన మోడీ.. ఇప్పుడు కటుంబ సభ్యలపై పడింది.

వాస్తవానికి ఇలాంటి దాడులను కవిత అంట్‌ టీమ్‌, కేసీఆర్‌, కేటీఆర్‌ ముందే ఊహించారు. ఎవరి జాగ్రత్తలో వారున్నారు. కానీ చరాస్తుల విషయంలో ఎన్ని జాగ్రత్తలైనా తీసుకోవచ్చు గానీ స్థిరాస్తుల విషయంలో పక్కాగా లెక్కలు చెప్పాల్సిందే. ఇరుక్కోవాల్సిందే. ఇదే అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది ఈడీ. ఎందుకే ఈడీ.. మోడీ ఎవరినీ వదలడం లేదు. నిజామాబాద్‌లో కూడాక కవితను బంధువులున్నారు. జాగృతిలో కూడా దగ్గరి బంధువులున్నారు. పీఏలున్నారు. వీరిపైనా దృష్టి పెట్టింది ఈడీ.

మున్ముందు ఇంకా ఎవరెవరినీ ఇందులో దొరకబట్టి ఇరికిస్తారో తెలియని కలకల వాతావరణం నెలకొన్నది. ఇప్పటికే బెయిల్‌పై ఆశలు వదిలేసుకుని నిరాశ నిస్పృహలో ఉన్న కవిత, అండ్‌ టీమ్‌కు ఈ దాడుల పరంపరం మరింత కలవరపాటుకు, భయాందోళనలకు గురి చేస్తోంది. ఏ క్షణమైనా నిజామాబాద్‌లో కూడా కవిత లింకులపై ఈడీ దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

You missed