దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి:

ఎమ్మెల్సీ కవిత పేరు నిజామాబాద్‌లో పేదల నోటి వెంట నిత్యం వినబడుతూనే ఉంది. ఆమెకు నిండు మనస్సుతో ఆశీస్సులు అందుతూనే ఉన్నాయి. కవిత జైలుకు పోయింది.. లిక్కర్‌ కేసులో అరెస్టయ్యింది అనేది రొటీన్‌ న్యూస్‌. అందరూ దీనిపైనే దృష్టి పెట్టారు. కానీ కవిత విషయంలో మరోకోణం దాగుంది. ఆమె ఆనాడు తలపెట్టిన నిత్యాన్నదానం కార్యక్రమం అన్నార్థుల గుండెల్లో ఆమెకు నిండు ఆశీస్సులు అందిస్తూనే ఉన్నాయి.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రాసుపత్రిలో ఆమె రోగుల వెంట వచ్చే బంధువులకు అన్నం దొరకక ఇబ్బందులు పడుతుంటే మానవతా దృక్పథంతో వారందరికీ జాగృతి తరుపున ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయించింది. ఆ తరువాత బోధన్‌, నిజామాబాద్‌ జిల్లా కేంద్ర లైబ్రరీలో కూడా అన్నదానం అందిస్తున్నారు. ఇలా నిత్యం పదిహేను వందల మందికి తగ్గకుండా ఆకలితో ఉన్నవారి ఆకలి తీరుస్తున్నారమె.

భారత జాగృతి ఈ కార్యక్రమం వెనుక ఉండి అంతా తామై నడిపిస్తున్నారు. కవిత అంటే కొందరికి కోపం, కొందరికి అసహ్యం. ఇంకొందరికి లిక్కర్‌ స్కాంలో అరెస్టయ్యిందా అంటూ చిన్న చూపు. ఎవరేమీ అనుకున్నా అన్నార్థులకు మాత్రం ఆమె అమ్మ. ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతున్న అన్నపూర్ణ.

You missed