దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

బీసీకే టికెట్‌ ఇద్దామని అధిష్టానం డిసైడ్‌ అయినా.. ఓసీకే టికెట్‌ వరించింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌ కుమార్‌ కు ఎంపీ టికెట్‌ ఇద్దామని అధిష్టానం అంతా ఓకే చేసింది. కానీ మహేశ్‌ కుమార్‌ నో చెప్పాడు. తనకు ఎంపీగా పోటీచేయాలని లేదని అధిష్టానం వద్ద తేల్చి చెప్పాడు. మరి ఎవరికిస్తే బాగుంటుంది… గెలుపు అవకాశాలున్నాయని మహేశ్‌కు అధిష్టానం అడిగినప్పుడు తను జీవన్‌రెడ్డి పేరును సూచించాడు.

దీంతో జీవన్‌ రెడ్డి పేరును అధిష్టానం ఫైనల్ చేసింది. ఇక నిజామాబాద్‌ లోక్‌సభ పోరులో ఇద్దరు బీసీలతో ఓసీ తలపడనున్నాడు. అందులో ఇద్దరు బీసీల్లో ఇద్దరికి ఇద్దరు మున్నూరుకాపులే కావడం గమనార్హం.

You missed