దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
బీఆరెస్ పార్టీ సీనియర్ నేత కోటపాటి నర్సింహానాయుడు ఆ పార్టీని వీడనున్నాడు. ఇంత జరిగినా అధిష్టానం ఆత్మపరిశీలన చేసుకోకపోగా.. అదే తీరుతో వ్యవహరిస్తుండటంతో ఇక పార్టీ వల్ల నాయకులకు గుర్తింపు, ప్రజలకు మేలు జరగదనే ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. గల్ప్ బాధితుల సమస్యల పట్ల పోరాటం చేసిన నేతగా ఆయనకు పేరుంది. పసుపు సాగు,రైతుల అవస్థలపైనా అపార అనుభవం ఉంది.
కానీ బీఆరెస్ పార్టీ లోకల్ లీడర్‌షిప్, అధిష్టానం ఆయన సేవలను గుర్తించలేదు. సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలమైంది. ఓడిన తరువాత కూడా పార్టీ వైఖరిలో, నేతల వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు కనబడకపోవడంతో అందరితో పాటు ఆయనా తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. పార్లమెంటు ఎన్నికల వేళ తన ప్లాట్‌ఫాం చేంజ్ చేసుకోవాలని మాత్రం డిసైడ్ అయ్యాడు.
ఇంతకు ముందు బీజేపీలో ఆయన చాలా ఏండ్లు పనిచేశాడు. ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ వైపు చూసేందుకు ఇష్టపడని కోటపాటి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను బలపర్చాలనే తలంపుకు వచ్చినట్టు తెలుస్తోంది.