దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
అనుకున్నట్టే జరిగింది. అటు తిరిగి ఇటు తిరిగి.. ఏవేవో సమీకరణలు ముందుకు తెచ్చి.. బీసీ ఓసీ అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూపి చివరకు జీవన్‌రెడ్డికే ఓటేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఓడిన నేతలకు టికెట్ ఇవ్వమని అధిష్టానం మొదట చెప్పినా నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థి ఎవరూ బలంగా కనిపించలేదు అధిష్టానానికి. సునీల్‌రెడ్డి నుంచి మొదలుపెట్టి ఈరవత్రి అనిల్, ఆకుల లలిత, డాక్టర్ కవితారెడ్డి, అరికెల నర్సారెడ్డి, దిల్ రాజు అన్న నర్సింహారెడ్డి.. ఇలా ఎందరో లైన్లో ఉన్నారు. టికెట్ ఆశించారు కానీ అధిష్టానం చివరకు సుదర్శన్‌రెడ్డి మాటనే విన్నది.
ఆయన సూచించిన అభ్యర్థి జీవన్‌రెడ్డికే ఓటేసింది. ప్రకటనే తరువాయిగా ఉంది. ఇద్దరు బీసీల మద్యరెడ్డి పోరు చేయనున్నాడు. బీజేపీ నుంచి అర్వింద్, బీఆరెస్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్‌లో బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య ఓ రెడ్డి .. అదీ నాన్ లోకల్ ముద్ర ఉన్న జీవన్‌రెడ్డి ఎలా గెలుపు తీరాలకు చేరుతాడో చూడాలి.