వాస్తవం- నిజామాబాద్‌ ప్రతినిధి:

డీసీసీబీ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన కుంట రమేశ్‌రెడ్డిని మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ప్రశంసించారు. రమేశ్‌రెడ్డిని లక్ష్మీ పుత్రుడిగా కొనియాడారు. అతను ఎక్కడున్నా తన పని తాను చేసుకుంటాడని, అప్పగించిన పనిని వందశాతం పూర్తి చేసి పార్టీకి నిబద్దతగా పనిచేసే కమిట్‌మెంట్‌ ఉన్న నాయకుడని ప్రశంసించాడు.

మంగళవారం డీసీసీబీ చైర్మన్ ఎన్నిక పూర్తయ్యింది. కుంట రమేశ్‌రెడ్డిని డైరెక్టర్లంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధికారులు కొత్త చైర్మన్‌పేరు ప్రకటించాడు. అనంతరం వీరంతా సుదర్శన్‌రెడ్డి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ రమేశ్‌రెడ్డి.. సుదర్శన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈసమయంలోనే రమేశ్‌రెడ్డిపై సుదర్శన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ పుత్రుడిగా అభివర్ణించారు.

You missed