దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఏనుగు వెళ్లి గాడిదమేదిక్కింది. అర్థమయ్యే ఉంటుంది. ‘ఓడిందే మంచిదైంది.. గాడిదెవరో గుర్రమెవరో తెలుస్తుంది..’ అన్నాడు కేసీఆర్ మొన్న. అధికార్టీని గాడిదతో పోల్చాడు. వాస్తవానికి గాడిదలా మారింది కేసీయారే. సరే, ఇప్పుడు విషయం అది కాదు. ఏనుగు గాడిదపై ఎందుకు ఎక్కింది..? ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎందుకు బీఆరెస్‌లో చేరాడు..?? అని. ఆరెస్‌ ప్రవీణ్‌కుమార్‌ను దళితులు తిట్టి తిట్టి దుమ్మెత్తిపోస్తున్నారు. అందరూ కాంగ్రెస్‌లోకి వెళ్తుంటే ఆర్ఎస్‌పీ బీఆరెస్‌లోకి ఎందుకు వెళ్లాడని చాలా మంది అనుకున్నారు. కానీ ఆరెస్పీ తీసుకున్నది కరెక్టు స్ట్రాటజీయే.

ఎందుకంటే.. బీఎస్పీ అధ్యక్షుడి తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు నేతృత్వం వహించాడు. ప్రాక్టికల్‌గా సాధకబాధకాలు చూశాడు. డబ్బులేనిది ఏ ఎన్నికా గెలవలేడు. అతనికి తత్వం బోధపడ్డది. దళితులు, బీసీలు ఇలా ఎన్ని మాటలు చెప్పినా ఎన్నికల్లో వర్కవుట్‌ కాదు. అందుకే తన సొంత సీటు కూడా గెలవలేకపోయాడు ఆర్‌ఎస్పీ. ఇక్కడ బీఆరెస్‌ గతీ అంతే అయ్యింది. మితిమీరిన అతి విశ్వాసం, అహంకారం ప్రదర్శించి ఘోరంగా దెబ్బతిన్నాడు కేసీఆర్. ఇద్దరికీ తత్వం బోధపడ్డది. ఇద్దరూ గెలిస్తే ఇలా ఒకరికొకరు దరి చేరకపోయిది. లౌకికపార్టీ, స్వర్ణయుగం అనే మాటలు రాకపోయివి.

కాంగ్రెస్‌ కాకుండా ఈ గడ్డు పరిస్థితుల్లో బీఆరెస్ చేరితే తనకు ఎంపీ టికెట్ ఖాయం. ఖర్చంతా కేసీయారే. పైసలకు కేసీఆర్ దగ్గర కొదవలేదు. అధికారం తప్ప. ఓ నాలుగైదేండ్లు ఓపిక పడితే.. మళ్లీ బీఆరెస్‌ అధికారంలోకి వస్తే.. తనకు కీలకమైన మంత్రి పదవి. ఆ మాట ఇన్‌డైరెక్టుగా కేసీఆర్ కూడా అన్నాడు. అంటే తను చట్టసభల్లోకి అడుగుపెట్టాలన్నా..ఓ మంత్రి పదవి దక్కించుకోవాలన్నా.. కేసీఆర్‌ లాంటి నాయకుడు అవసరం. అందుకే ఈ ఏనుగు గాడిదెక్కింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కావాల్సిన ఎంతో కొంత మందికి ఎమ్మెల్సీ టికెట్లు ఇప్పించుకోవచ్చు. కొంతమందికైనా. దీంతో పాటు పార్టీ పదవులు. ఇలా ఆలోచించాడు ఆరెస్పీ.ప్రవీణ్‌ ఆలోచనలు సరైనవే.

సేమ్ కేసీఆర్‌ లాగే. కేసీఆర్‌ కూడా అంతే పక్కా రాజకీయనాయకుడిలా ఆలోచిస్తాడు. అవసమైతే దగ్గరికి తీస్తాడు. అవసరం తీరాకా ముఖం కూడా చూడడు. అదే పాలసీని అవలంభిస్తున్నాడు ఆరెస్పీ. పైకి చెప్పేవన్నీ కాకమ్మ కహానీలు. లోపల ఇద్దరి రాజకీయ ఎత్తుగడలు ఎవరికి వారికే ఉన్నాయి. అవి తీరాక కలిసుంటారా..? చెప్పలేం. అసలు కేసీఆర్‌ను ఎలా నమ్ముతారబ్బా..? నమ్మాల్సిందే. కొన్ని సార్లు రిస్క్‌ తీసుకోవాలి. మరి చెప్పింది చేయకపోతే…? ఏం చేస్తాడు. దానికి కూడా సిద్దపడే ఉంటాడు.

ఇదో ప్రయోగం, రాజకీయ ఎత్తుగడ అంతే. అన్ని వేళలా ఎత్తుగడలు సక్సెస్‌ కావాలని లేదు. కానీ ఆరెస్పీ ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగిందే. రాజకీయ నాయకుడి లక్షణాలు ఒంటబట్టించుకున్నందుకు.

You missed