శివసేన ఎంట్రీ… బీజేపీకి గండి. బోధన్‌లో భారీ సభ… బీజేపీ శ్రేణులు వెళ్లొద్దంటూ కమలనాథుల బుజ్జగింపులు… సేన ఎంట్రీతో జిల్లాలో దారితప్పి బెడసికొట్టనున్న బీజేపీ వ్యూహాలు… నిజామాబాద్‌లో అన్ని చోట్లా పోటీ చేస్తామని కాలుదువుతున్న శివసేన నేతలు.. అంతిమంగా బీజేపీ ఓట్లు చీల్చి .. ఎవరికి మేలు చేయనుంది..? ఆసక్తికరంగా మారిన శివసేన రాక… బీఆరెస్‌ను దెబ్బకొట్టడమే తమ వ్యూహమంటున్న జిల్లా అధ్యక్షుడు…
బీజేపీకి దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్నదా..? మొన్నటి వరకు అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పోయిన బీజేపీకి.. కర్ణాటక షాక్‌నిచ్చింది. ఆ షాన్ నుంచే కోలుకోలేక, గ్రూపుల పంచాయతీలతో సతమతమవుతున్న క్రమంలో కొత్తగా జిల్లాలో శివసేన ఎంట్రీ…