న‌మ‌స్తే తెలంగాణ అత్యుత్యాహం కేసీఆర్ ప‌రువు తీస్తున్న‌ది. జాతీయ రాజ‌కీయాల్లో ఆయ‌న‌కు అంత‌టా ఆహ్వానం దొర‌కుతున్న‌ది.. మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ది. దీన్ని ప్రొజెక్ట్ చేస్తే స‌రిపోతుంది. కానీ పెద్ద సారు ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేయాల‌నే త‌హ‌త‌హ‌లో అన‌ని మాట‌లను అన్న‌ట్టుగా ప్ర‌చురించేసి నాలుక్క‌ర్చుకున్నారు. దీని ప‌ర్య‌వ‌సానం .. వాళ్లు పేప‌ర్లు త‌గుల‌బెట్టేంత వ‌ర‌కు పోయింది. మేము ఎప్పుడ‌న్నం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని..? అని నిల‌దీసేంత వ‌రకు.

ఓ సీరియ‌స్ పొలిటిక‌ల్ ఇష్యూను ఇలా న‌మ‌స్తే త‌న అత్యుత్సాహంతో ర‌చ్చ‌కీడ్చి ర‌చ్చ ర‌చ్చ చేసిన‌ట్ట‌య్యింది. ఇప్పుడిది వైర‌ల్‌గా మారింది. ఉన్న‌దున్న‌ట్టు చెబితే స‌రిపోతుంది. మ‌రీ స్వోత్క‌ర్ష‌కు అల‌వాటు ప‌డిపోయి… పెద్ద సారును కూడా అదే మ‌త్తులో ముంచి తాము అలా మంచి మార్కులు కొట్టేసి శ‌భాష్ అనిపించుకుందామ‌నే యావ‌లో న‌మ‌స్తే పెద్ద‌లు ఇలా త‌ప్పుదారి ప‌ట్టించి ప‌రువు తీసుకునేలా చేశార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

You missed