దేశ పాలన ప్రస్తుతం లక్ష్యం లేకుండా ముందుకు సాగుతుందని, ఇది చాలా ప్రమాదకరమన్నారు కేసీఆర్. దేశంలో పరివర్తన రావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇక వేచి చూడటం వల్ల మరింత మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు. సోమవారం రాత్రి మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పెద్ద ఎత్తున ఈ సభకు స్పందన లభించింది. కేసీఆర్ స్పీచ్ ఆసాంతం మరాఠా ప్రజలను ఆకట్టుకుంది.
దేశ పరిస్థితులను ఆయన దేశ ప్రజల ముందుంచారు ఈ వేదికగా. రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చట్టాలు తెచ్చిన ప్రధాని 750 మంది రైతుల చావుకు కారణయ్యాడని దుయ్యబట్టారు. ఆ తర్వాత తాపీగా క్షమాపణ చెప్పాడని విమర్శించారు. దేశ ప్రజల బాగు కోసమే బీఆరెస్ పుట్టిందన్న కేసీఆర్…. బీఆరెస్ వస్తేనే భారత్ తలరాత బాగుపడుందన్నారు. లేకపోతే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇక జరిగిన నష్టం చాలని ఆయన ప్రజలకు సూచన చేశారు. ఎన్నో జీవనదులు ప్రవహించే భారత్‌లో ఇప్పటికీ తాగునీటి సమస్య ఉందని ఉదాహరణలో వివరించడం జనాలను ఆకట్టుకున్నది.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని వివరిస్తూనే…. ఇక్కడ కూడా అదే పరిస్థితులు తెప్పిస్తామని ఆయన హామీనివ్వడం మరాఠా ప్రజలకు ఆకర్షించింది. ఈ సారి ఎన్నికలు ఉత్తిత్తివి కావని, ఇవి జనాలు మేల్కొని తమను తాము కాపాడుకొని, రక్షించుకునే ఎన్నికలవుతాయని, ప్రజలు గెలిస్తేనే దేశం గెలుస్తందన్నారు. పార్టీలు, లీడర్లు గెలిస్తే భారత్ గెలవదని, ప్రజల కష్టాలు పోవని ఆయన వివరించడం ప్రజలను ఆలోచింపజేసింది. నీరు, కరెంటు ఇవ్వడంతో దేశం ఇంకా ఎందుకు వెనుకబడిందని, ఇతర దేశాల గత పరిస్థితులు, ఇప్పటి స్థితిగతులను సోదాహరణగా వివరించడం ఆలోచనల రేకెత్తించేలా చేసింది. తెలంగాణ ఎంతో చిన్న రాష్ట్రం, మహారాష్ట్ర కన్నా బలహీనమైనదని మరి అక్కడ సాద్యమవుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించడం మరాఠా ప్రజలను మరింత చైతన్యవంతం చేసింది.
నీటి, బొగ్గు వసతి ఉన్నా.. సాగునీరు, కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ఈ వేదికగా దేశ ప్రధానిని ప్రశ్నించారు. ఏ పార్టీ వచ్చినా.. ఎవరు ప్రధాని అయినా లాభం లేదని చాలా సార్లు రూఢీ అయిపోయిందని, ఇక లాభం లేదని బీఆరెస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆరెస్ అధికారంలోకి రాగానే ప్రైవేటీకరణ మొత్తం ఎత్తేస్తామని, తెలంగాణ మోడల్ అంతటా అమలు చేస్తామన్నారాయన.