ఆ పేరంటే చేదా నీకు… ఆ ఉద్దేశమే లేదా నీకు..! రేవంత్ పేరు పలకని కేసీఆర్.. కేటీఆర్ పేరెత్తడానికి చికాకు పడుతున్న రేవంత్..
(దండుగుల శ్రీనివాస్) ఆ పేర్లకు ఎలర్జీ వచ్చింది. వాటిని పలకడానికి కొందరు ఇష్టపడటం లేదు. అందరికీ తెలిసిన పేర్లే. అందరి నోళ్లలో నానే పేర్లే. వీఐపీలవే కానీ… అవి పలకాలంటే కొన్ని నోర్లకు కంపరమొస్తున్నది. చికాకు నశాలనికంటున్నది. అదే అతడే.. ఆయనే…
