లీకు వీరుడు సంతోష్‌.. ట్యాపింగ్ కార‌కుడు కేటీఆర్‌..!?

ఇదేనా క‌విత క్లారిటీ ఇచ్చిన విష‌యం…!?

టీవీ5 ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాలు వెల్లడి… మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ఎమ్మెల్సీ..

కేసీఆర్ చుట్టూ రెండు ద‌య్యాలే..!

సంతోష్‌రావు.. కేటీఆర్‌..!

క్లారిటీ ఇచ్చిన క‌విత‌..

త‌న‌కు సీఎం కావాల‌నే ఆశ ఉంద‌ని మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టిన క‌విత‌…

సొంత పార్టీ పెట్టేది లేద‌ని చెబుతూనే.. రేపు అధికారంలోకి వ‌చ్చినా ప్ర‌తిప‌క్ష పాత్రేన‌న్న ఎమ్మెల్సీ..

ఫోన్ ట్యాపింగ్‌కే కేసీఆర్‌కు సంబంధం లేద‌న్న క‌విత‌.. అది కేటీఆర్ ప‌నేన‌ని ప‌రోక్ష వెల్ల‌డి..

కేసీఆర్ మాత్ర‌మే త‌న‌కు స్పూర్తిదాయ‌క‌మ‌న్న ఆమె.. కేటీఆర్‌ను స్పూర్తిగా తీసుకోలేనని కుండ‌బ‌ద్ద‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఆమె ఇప్పుడు వేసే ప్ర‌తి అడుగూ వ్యూహాత్మ‌క‌మే. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు వేసుకునే సోపానంలో భాగ‌మే. ఇదిగో ఈ టీవీ5 ఇంట‌ర్వ్యూ కూడా అందులో భాగ‌మే. ఇందులో ఆమె చాలా విష‌యాలు షేర్ చేసుకున్న‌ది. చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. క‌విత పార్టీ పెడుతుందా..? ఆమె ద‌య్యాల‌న్న‌ది ఎవ‌రినీ..? పేర్లు ఎందుకు బ‌య‌ట పెట్ట‌డం లేదు…? ఈ ఫార్మూలా కార్ రేస్ ఏసీబీ కేసులో అన్న‌కు స‌పోర్టు చేసిన క‌విత‌… ఫోన్ ట్యాపింగ్ విష‌యంలో ఏం చెప్పింది..? చాలా చాలా విష‌యాల్లో ఆమె క్లారిటీ ఇచ్చింది. మూర్తి అడిగిన సూటి ప్ర‌శ్న‌ల‌కు ఆమె పొడిపొడిగానే స‌మాధానం ఇచ్చినా..ప‌రోక్షంగా వెల్ల‌డించినా .. త‌న మ‌న‌సులో మాట జ‌నాల‌కు అర్థ‌మ‌య్యేలాగే మాట్లాడిందామె. ఆమె ఈ ఇంట‌ర్వ్యూలో ఏ ఏ విష‌యాల్లో క్లారిటీ ఇచ్చిందో వాస్త‌వం ఇస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం ఇది..

– ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయాల్సిన దౌర్బాగ్య ప‌రిస్థితి లేద‌న్న క‌విత‌.. అది కింది స్థాయి వాళ్లు చేసి ఉంటార‌ని చెప్పుక‌నే కేటీఆర్ పేరును సూచించేలా మాట్లాడింది. మ‌ళ్లీ దీన్ని క‌వరింగ్ చేస్తూ అస‌లు రేవంత్ స‌ర్కార్ మీద న‌మ్మ‌క‌మే లేద‌ని చూద్దాం ఇందులో ఎంత వాస్త‌వం ఉందో..న‌ని మాట మార్చింది..

– త‌న ఇంట్లో త‌న వ‌ద్ద ప‌నిచేసే వాళ్ల ఫోన్లు, త‌న అనుచ‌రుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయ‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. వారికి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సిట్ నుంచి కాల్స్ వ‌చ్చిన విష‌యం కూడా వెల్ల‌డించింది. విచార‌ణ‌కు వెళ్లాల్సిందిగా సూచించిన‌ట్టు తెలిపింది. అంటే ఫోన్ ట్యాపింగ్ వాస్త‌వేమేన‌ని ఇక్క‌డ క్లారిటీ ఇచ్చిందామె.

– లీకు వీరుడు సంతోష్ రావేన‌ని ఆమె ప‌రోక్షంగా వెల్ల‌డించింది. ఆయ‌న వ‌ల్లే త‌మ ఫ్యామిలీ హ్యాపీగా లేద‌ని కూడా ఆమె వ్యంగ్యంగా, న‌ర్మ‌గ‌ర్భంగా వెల్ల‌డించింది. కేసీఆర్ ఎన్ని ఇడ్లీలు తిన్నాడో కూడా బ‌య‌ట‌కు చెప్పేంత అక్క‌డ ఎవ‌రికి అవ‌కాశం ఉంది..? అని సంతోష్ రావును కార్న‌ర్ చేసిందామె.

 

– త‌ను పార్టీ పెట్ట‌బోయేది లేద‌ని, ఇది లీకు వీరుడి లీకు క‌థ‌నాలేన‌న్న క‌విత‌.. సీఎం కావాల‌ని త‌న కోరిక‌గా చెప్పుకొచ్చింది. తండ్రి త‌రువాత త‌నే చాన్స్ తీసుకుంటాన‌న్న‌ది. అది ఎన్నేండ్లైనా స‌రేన‌ని ఆమె ప్ర‌క‌టించుకున్న‌ది.

– కేటీఆర్‌ను పార్టీ అధినేత‌గా త‌ను స్వీక‌రించ‌బోన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. కేసీఆర్ ఒక్క‌డే త‌న నాయ‌కుడ‌న్న‌దామె. కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకునే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, మ‌రెవ‌రూ త‌న‌కు స్పూర్తి కాబోర‌ని ఆమె ప‌రోక్షంగా కేటీఆర్ గురించి చెప్పుకొచ్చింది.

– హ‌రీశ్‌, కేటీఆర్ మ‌ధ్య సంబంధాలు అంతంత మాత్ర‌మేన‌నే విష‌యాన్నీ క్లారిటీ చేసింది. కృష్ణార్జునులు అన‌డం కేవ‌లం పైకి క‌వ‌రింగు ఇచ్చుకోవ‌డానికేన‌ని.. హ‌రీశ్‌కు కూడా సీఎం కావాల‌ని ఉంద‌ని, అలా లేక‌పోవ‌డ‌మే పొర‌పాట‌ని అన్న‌దామె.

– జైలు జీవితం గ‌డిపిన‌ప్పుడు త‌న‌కు కేసీఆర్ ఒక్క‌డి నుంచే స‌పోర్టు ఉంద‌న్న క‌విత‌… అన్న స‌పోర్టు గురించి సోసోగా మ‌ట్లాడింది.

 

– తెలంగాణ జాగృతిని దూకుడుగా తీసుకుపోవ‌ద్ద‌ని ఆనాడు కేసీఆరే చెప్పాడ‌న్న ఆమె.. ఇక‌పై జాగృతిని బ‌లోపేతం చేస్త‌మ‌న్న‌ది. రేపు పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. తాము మాత్రం ప్ర‌తిప‌క్ష పాత్రే పోషిస్తామ‌న్న‌దామె.

– ఢిల్లీ లిక్క‌ర్ కేసు కేసీఆర్‌పై ప్ర‌తీకారంగా బీజేపీ పెట్టిన కేస‌ని, దీనిపై కేసీఆర్ త‌మ‌ను ముందే హెచ్చ‌రించాడ‌ని, జైలుకు వెళ్లేందుకు ప్రిపేర్ కావాల‌ని కూడా సూచించిన‌ట్టు తెలిపిందామె.

– 4 ఎంపీ సీట్ల కోసం బీజేపీ ఎంత‌గా దిగ‌జారుతుంతో త‌నే ఓ ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్న‌ది.

Dandugula Srinivas

Senior Journalist

8096677451

 

You missed