Tag: #bhattivikramarka

రోడ్డున ప‌డ్డ గుత్తేదార్ల బ‌తుకులు… ! వీధికెక్కిన స‌ర్కార్ ప‌రువు..!! చిన్న కాంట్రాక్ట‌ర్ల జీవితాలు చితికిపోయాయి…. క‌మీష‌న్లు తీసుకుంటూ పెద్ద కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లుల చెల్లింపులు… డిప్యూటీ సీఎం మొద‌లు… ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వ‌ర‌కు… అంతా క‌మీష‌న్ల తీస్మార్ ఖాన్‌లే…! తాళిబొట్లు తాక‌ట్టు పెట్టి… ప‌నులు చేస్తే.. ఏళ్లుగా బిల్లులు లేవు.. క‌మీష‌న్లిస్తేనే బిల్లులిచ్చే సంస్కృతికి కాంగ్రెస్ ద్వారాలు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) తాళిబొట్ల‌మ్ముకున్నారు. ప‌ది రూపాల మిత్తీల‌కు తెచ్చుకున్నారు. గ‌వ‌ర్న‌మెంటు ప‌నులు చేస్తే నాలుగు పైస‌లు సంపాదించుకోవ‌చ్చ‌నుకున్నారు. ఆ పుస్తెలు తాక‌ట్టులోనే ఉన్నాయి. బిల్లులు బ‌ల్ల‌కిందే ఉన్నాయి. క‌మీషన్లిస్తే బిల్లులు. పెద్ద‌ల‌కు ద్వారాలు తెర‌వ‌బ‌డి ఉన్నాయి. మంత్రి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు మొద‌లు…

వాస్త‌వాలు మాట్లాడితే మీ త‌ల‌లు వెయ్యివ్ర‌క్క‌ల‌వు గాకా…!! నువ్వంటే నువ్వు… ! అప్పుల చిప్ప‌లు… స‌మ‌ర్థింపు లెక్క‌లు… ముప్పు తిప్ప‌లు…!! ఉచితానుచితాలు..! ఓటు బ్యాంకు రాజ‌కీయాలు..!! హామీల పేరుతో జ‌నాల‌కు బురిడీలు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ సందేహానికి స‌మాధానం తెలిసీ చెప్ప‌లేక‌పోయావో.. నీ త‌ల వేయి వ్ర‌క్క‌ల‌వుతుంది…! అని బేతాళుడు విక్ర‌మార్కుడిని అన్న‌ట్టుగా.. అసెంబ్లీలో స‌భ్యులు వాస్త‌వాలు మాట్లాడితే కూడా వారి త‌ల‌లు వేయి వ్ర‌క్క‌ల‌వుతాయి.. అనే శాపం ఉంది కాబోలు. ఈ మాట‌న్న‌ది…

అసంద‌ర్బోత్స‌వాలు…! విజ‌యోత్స‌వాలు జ‌రుపుకునే స‌మ‌య‌మా సార్ ఇది..! జ‌నాలు క‌ష్టాల్లో ఉన్నారు.. తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు…! హామీల అమ‌లుతో ఆదుకోండి..! భ‌రోసానివ్వండి… రైతుభ‌రోసా రిలీజ్ చేయండి.. రుణ‌మాఫీ సంపూర్ణం చేయండి..! 4వేల పింఛ‌న్ అమ‌లుకు క్లారిటీ ఇవ్వండి… రోమ్ చ‌క్ర‌వ‌ర్తి ఆలోచ‌న‌లు చేయ‌కండి.. !

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇలా ఏడాది పూర్త‌య్యిందో లేదో అలా విజ‌యోత్స‌వాలు జ‌రుపుకోవాల‌ని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్ స‌ర్కార్‌. భ‌ట్టి ఇవాళ దీనికి సంబంధించిన షెడ్యూల్ ఒక‌టి ప్ర‌క‌టించేశాడు కూడా న‌వంబ‌ర్ 14 నెహ్రూ పుట్టిన రోజు నుంచి మొద‌లుకొని డిసెంబ‌ర్ 9…

You missed