(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఈ సందేహానికి స‌మాధానం తెలిసీ చెప్ప‌లేక‌పోయావో.. నీ త‌ల వేయి వ్ర‌క్క‌ల‌వుతుంది…! అని బేతాళుడు విక్ర‌మార్కుడిని అన్న‌ట్టుగా.. అసెంబ్లీలో స‌భ్యులు వాస్త‌వాలు మాట్లాడితే కూడా వారి త‌ల‌లు వేయి వ్ర‌క్క‌ల‌వుతాయి.. అనే శాపం ఉంది కాబోలు. ఈ మాట‌న్న‌ది స్వ‌యంగా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్కే. కాక‌పోతే ఆయ‌న ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌నుద్దేశించి, ముఖ్యంగా హ‌రీశ్‌రావు మాట‌ల‌కు ఇలా స్పందించాడు.

మీరు వాస్త‌వాలు చెబితే మీ త‌లలు వేయి వ్ర‌క్క‌ల‌వుతాయి అనే శాపం ఉంది కాబోలు.. అందుకే అన్ని అవాస్త‌వాలు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న ఈ సంద‌ర్బంగా అన్న మాట‌లు.. ఒక్క‌రికి కాదు.. ఇద్ద‌రికీ వర్తిస్తాయి. ఇద్ద‌రంటే… ప్ర‌తిప‌క్షం.. అధికారప‌క్షం. అవును..! అసెంబ్లీలో అప్పుల‌పై వాడీవేడీగా చ‌ర్చ సాగుతోంది. నువ్వింత చేశావంటే.. నువ్వింత చేశావ‌ని.. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. నా హ‌యాంలో ఇంత చేశాను.. మీ హ‌యాంలో ఇంత చేశారు చూశావా..? అని ఒక‌రు చేసింది ఒప్పు.. మ‌రొక‌రు చేసింది త‌ప్పు అని అప్పుల చిప్ప‌ల గురించి క‌ప్ప‌ల బెక‌బెక‌లా అసెంబ్లీ రణ‌గొణ‌ధ్వ‌నుల‌తో సాగిపోతున్న‌ది.

ఒక‌రంటారు.. మీరంతా అప్పులు చేసి పోయారు.. ఇక మేం వాటిని మిత్తీలు క‌ట్టేందుకే ఏడాది 70వేల కోట్లు క‌డుతున్నాం.. వీటి కోస‌మే అప్పులు తెస్తున్నాం.. తెలుసా..? ఛీ ఛీ మీరూ మీ ప‌దేళ్ల పాల‌నా…! అంటూ యాక్ థూ అని ఉమ్మేస్తున్నాడు. ఏయ్‌.. అబ‌ద్దాల కోరు… మేం 7 ల‌క్ష‌ల కోట్లు చేశామా…! జ‌స్ట్‌.. జ‌స్ట్ 4 ల‌క్ష‌ల కోట్ల పై చిలుకు అంతే. అంతేగా..! మ‌రి దీనికే ఇంత‌లా క‌డుపు, నోరు చించుకొని మ‌మ్మ‌ల్ని బ‌ద్నాం చేస్తున్నారు… ఛీ ఛీ మీరూ మీ పాల‌న‌… ! ఏడాదికే ల‌క్ష కోట్ల పై చిలుకు అప్పులు చేశారు తెలుసా…. ! అంటే ఈ లెక్కన ఐదేళ్ల‌కు ఒక‌టి.. రెండు… ఐదు…. ఆ… ఐదారు ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేస్తార‌న్న‌మాట‌.

అంటే మాక‌న్నా మీరే ఎక్కువ అప్పులు చేస్తార‌న్న‌మాట‌..! అంటే మీది మంచిపాల‌న అవుతుందా..? మాది మంచి పాల‌న అవుతుందా…!! చెప్పండి చెప్పండి అధ్య‌క్ష‌! జ‌నాలు చూస్తున్నారు… అంటూ అంద‌రినీ ఈ అప్పులచిప్ప‌ల వ్య‌వ‌హారంలో లాక్కొచ్చి త‌న వైపు జనాలు వ‌కాల్తా పుచ్చుకునేలా అపోసోపాల ప్ర‌సంగం ఒక‌టి చేశాడు. ఛ‌స్‌..! మేం హామీలిచ్చాం కానీ.. లంకెబిందెలుంటాయ‌ని ఆశ‌తో ఇచ్చాం.. ఆశ పెట్టాం.. వారూ న‌మ్మారు..! మీరిచ్చిన తాయిలాలు అప్ప‌నంగా తిన మ‌రిగిన ఓట‌ర్లు.. మేం చెప్పిన వాటికి మైమ‌రిచి … మాకేశారు.. ఎక్కించారు. కానీ ఇగో వైట్ పేప‌ర్‌.. ఏం లే… అంతా అప్పులూ మిత్తీలే…! అన్నాడు అవాస్త‌వ స‌మ‌ర్థింపులో భాగంగా.

మ‌రెందుకు ఆనాడు మాక‌న్నీ తెలుసు.. బొక్క‌లు.. అప్పులు.. చిప్ప‌లు.. క‌ప్ప‌లు.. అన్నీ అన్నీ తెలుసున‌న్నారు… ఇప్పుడు ఎందుకు ఇవ‌న్నీ గుర్తొచ్చాయి…! చేసేయండి.. అమ‌లు చేసేయండి…!! దెప్పిపొడుస్తున్నాడు ఇంకొక అవాస్త‌వ స‌మ‌ర్థింపు బ్యాచీకి టెంప‌ర‌రీ బాసు.