బతుకమ్మ పాట సాక్షిగా.. ఒకరి తప్పులొకరెంచుకుని.. ఒకర్నొకరు తిట్టుకొని… పాతాళంలోకి జారిపోయి..
హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగే వరకు ఇంకెన్ని వింతలు చూడాలో.. ఇంకెన్ని ఘోరాలు చూసి తట్టుకోవాలో. దేన్నీ వదలడం లేదు. ఫేక్ న్యూస్‌లో మీరు షేర్ అంటే.. మేం సవ్వాషేర్ అంటున్నారు. నువ్వు అట్ల పెట్టి మమ్మల్ని బద్నాం చేస్తవా..? చూడు…
నటనలోనే కాదు.. నిజ జీవితంలో కూడా నువ్వు జీరోవే విష్ణు
నటించినప్పుడే కాస్త చూడాలనిపిస్తుంది. రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి, డైలాగులు వినిపించినప్పుడే కొంచెం పర్వాలేదనిపిస్తుంది. ఎప్పుడైతే నిజ జీవితంలో నిజ్జంగా మాట్లాడటం మొదలుపెడతారో.. ఇలా తమ మేథస్సు మురుగు నీటిలా ఉబికివస్తుంది. వారి పరిపక్వతా స్థాయి స్టామినా బయటపడుతూ ఉంటుంది. అవివేక రంగులు…
Holiday Mla: ఈ ఎమ్మెల్యేకు సండే హాలిడే.. ఎవ్వరూ కలవొద్దు.. ఫోన్ చేసినా స్పందించడు….
ఆయన మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పోటీ చేస్తూనే ఉన్నాడు. ఓడిపోతూనే ఉన్నాడు. కానీ ప్రజల వద్దకు వెళ్లడం ఆపలేదు. వారితో మమేకమయ్యే పనికి దూరం కాలేదు. కలసి ఉన్నాడు. కలిసి తిరిగాడు. కలిసి తిన్నాడు. ఉద్యమకాలం నుంచి…
బతుకమ్మ పాట…. హనుమంతుడిని చేయబోయి కోతి.. అంతటా పెదవివిరుపు..
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్మించిన అల్లిపూల వెన్నల బతుకమ్మ పాట పై అంతటా అసంతృప్తే కనిపిస్తున్నది. దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారంతా. మిట్టపల్లి సురేందర్ రాసిన పాట ఎవరికీ నచ్చలేదు. టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ దీనిపై తమ అసంతృప్తి వెల్లడి…
Ramayan: ‘రావణుడి’కన్నుమూత…. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అర్వింద్ త్రివేదీ..
అవును మీరు విన్నది నిజమే.. రావణుడు కన్నుమూశాడు. 1980లో ఎంతో పాపులర్ అయినటువంటి రామాయణ్… అనే సీరియల్ మనందరికీ తెలిసిందే. అందులో రావణుడి పాత్ర ధరించిన అర్వింద్ త్రివేదీ (82) గుండెపోటుతో రాత్రి తుదిశ్వాస విడిచాడు. రామాయణ్ సీరియల్ ఎంత పాపులర్…
రిపోర్టర్ రాజారెడ్డి.. ధారావాహికం-19
రాజారెడ్డి ఆలోచనలన్నీ ఇంటిచుట్టే తిరుగుతున్నాయి. “ఇంట్లో వనజ ఏం చేస్తూ ఉంటుంది?” అని ఆలోచిస్తూ బైక్ నడుపుతున్న రాజారెడ్డికి ఆ వీధి మూలమలుపు దగ్గరే నరసింహం ఎదురయ్యాడు. రాజారెడ్డిని చూసి సడన్ బ్రేక్ వేశాడు. ‘ఏం రెడ్డి ఎటొచ్చావు?” అడిగాడు. బైక్…
బతుకమ్మ పాట అంచనాలు అందుకోలే…
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తొలిసారిగా ఓ కొత్త ప్రయోగం. ఏఆర్ రహ్మాన్ మ్యూజిక్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్… వీరిద్దరి కలయికలో వచ్చే పాట .. అంచనాలు మించిపోయాయి. కానీ అనుకున్నంతగా ఈ పాట ఆకట్టుకోలకపోయిందనే అభిప్రాయాలున్నాయి. స్లోగా సాగిన పాట……
జర్నలిస్టు ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నా.. అల్లం నారాయణ స్పందించడా..?
పత్రికల్లో యాడ్స్ పేరుతో వేధింపులు ఈ రోజు కొత్తవి కావు. ఇవి ఇప్పట్లో ఆగేవీ కావు. కానీ కరోనా వల్ల మార్కెట్‌లో పైసా పుట్టని పరిస్థతుల్లో ఈ టార్గెట్లు రిపోర్టర్ల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ వార్త సీనియర్…
‘బతుకమ్మ” కు డీజే పాటలు.. సినిమా పాటలా…? పద్దతి మార్చుకోండ్రి జర..
బతుకమ్మ కు గౌరవనీయులైన తెలంగాణ హిందూ మహిళలకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు విన్నపము: బతుకమ్మ పండుగ వచ్చింది.ఇగ మీరు DJ పాటలు పెట్టి సినిమా డ్యాన్స్ చేయకండి. దయచేసి పండుగ సంస్కృతి, సంప్రదాయం & కాపాడండి.మీకు తెలియకపోతే, పెద్దల నుండి బతుకమ్మ…
శునకానంద పరవశం…ఒకరిపై మరొకరు.. ఒకరికి మించి ఇంకొకరు..
హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసే సమయానికి ఇంకెన్ని చూడాలో. చిత్ర విచిత్రాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. గెలుపు కోసం ఎన్ని పక్కదారులు తొక్కాలో ఇక్కడ చూసి వేరే వాళ్లు నేర్చుకోవాలేమో. సోషల్ మీడియాను ఎన్ని వక్రవంకలు తిప్పాలో.. ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో..…
