(దండుగుల శ్రీ‌నివాస్‌)

జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా …. అవును జ‌యం ద‌క్కే వ‌ర‌కు పోరాడాల్సిందే. మ‌ధ్య‌లో వ‌దిలితే. మ‌రుస్తారు. యాదిలో కూడా ఉండ‌రు. కానీ ఈ ఇద్ద‌రూ ఐరెన్ లెగ్గులు .. ఇవాళ ఇంకా వెండితెర‌ను ఏలుతున్నారు. వారే.. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌. జగ‌ప‌తి హోస్టింగ్ చేస్తున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా ..లో ర‌మ్య‌కృష్ణ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అంత‌కు మందుకు వ‌చ్చిన చాలా మంది యాక్ట‌ర్ల క‌న్నా చాలా చాలా బెట‌ర్ ర‌మ్య‌. ఎంత ఎదిగినా ఒదిగుండే ర‌కం. ఆమె న‌వ్వు ఇంకా చిన్న‌పిల‌ల్లా క‌ల్మ‌షం లేకుండా.. ఎదుట ఎవ‌రున్నారో కూడా చూసుకోకుండా మ‌న‌సారా న‌వ్వుకునే ఆమె మ‌న‌స్త‌త్వం చాలా త‌క్కువ మందికే ఉంటుంది. కోపం వ‌చ్చినా ఆపుకోదు.

న‌వ్వు వ‌చ్చినా ముఖం మీద ప‌గ‌ల‌బ‌డి క‌నిపించేస్తుంద‌ది. ఇక ఏడుపు వ‌స్తే క‌ళ్ల వెంట జ‌ల‌జ‌లా నీళ్లు. అదీ ఆమె మెంటాలిటీ. ఎంతో టాలెంటెడ్‌. కానీ ఆదిలోనే హంస‌పాదులా అన్నీ క‌ష్టాలే. ఫ్లాపులే. కానీ రాఘ‌వేంద్ర‌రావు రూపంలో ఆమెకు లైఫ్ దొరికింది. అంతే ఆమెకి తిరిగి చూడ‌లేదు. అప్ప‌టి వ‌ర‌కు ప‌డుతూ లేస్తూ… లేస్తూ పాతాళంలోకి ప‌డిపోతూ వచ్చింది. ఇదంతా ఆమే చెప్పింది.. ప్రోగ్రాంలో. జ‌గ‌ప‌తి కూడా అంతే. ఇద్ద‌రిదీ ఐరెన్ లెగ్. కానీ ఇద్ద‌రూ ఇవాళ త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుని ఇంకా ఇంకా అవ‌కాశాలు త‌మ వ‌ద్ద‌కే వెతుక్కుంటూ వ‌చ్చేలా చేసుకున్నారు. జ‌యాన్ని బానిస చేసుకున్నారు. శ్ర‌మ‌ను న‌మ్ముకున్నారు. ఐరెన్ లెగ్గు మాట‌ల‌ను ప‌ట్టించుకోలేదు. క‌ష్ట‌ఫ‌లే అని వంట ప‌ట్టించుకున్నారు. అందుకే ఇద్ద‌రూ ఇలా గోల్డెన్ లెగ్గులుగా నిలిచిపోయారు.

Dandugula Srinivas

Senior journalist

7661066999