(దండుగుల శ్రీ‌నివాస్‌)

నాకొంచెం తిక్కుంది… కానీ దానికోలెక్కుంది! ఇది ప‌వ‌న్ ఫేమ‌స్ డైలాగ్‌. కానీ ఓజీ సినిమాకు మాత్రం ఓ లెక్క‌లేదు. అంతా తిక్కే ఉంది. తిక్క‌తిక్క‌గా ఉంది. తిక్క‌కే తిక్క‌రేగేలా ఉంది. తిక్కోడికే తిక్కెక్కించేలా ఉంది. మొత్తానికి చిత్తుగా తిక్క‌గా చెత్త‌గా ప‌ర‌మ చెత్త‌గా ఉంది. టోట‌ల్‌గా ఇదీ ఓజీ సినిమా రివ్యూ. క‌థ రాసుకున్న‌ది డైరెక్ట‌ర్ సుజీతేన‌ట‌. ఇంకే క‌థ దొర‌క‌లేదా బాబు నీకు. అస‌లు ఇందులో క‌థంటూ ఏదైనా ఉందా..? క‌త్తి తిప్ప‌డం.. క‌స‌క‌సా ర‌పార‌పా న‌రికేయ‌డం.. ర‌క్తాలు ఫౌంటేన్‌ల‌లా చిమ్మించ‌డం… ఇదీ టోట‌ల్ ఓ తిక్క సినిమా క‌థ‌. అదే తిక్క‌లోడి క‌త్తిసాము క‌థ‌. ముందే కోతి ఆపై క‌ల్లు తాగితే.. అచ్చంగా ఓజీ సినిమాలాగే ఉంటుంది. ప‌వ‌న్‌కు ఓ పైత్యం ఉంది. డైరెక్ష‌న్‌లో కాలు, వేలు, త‌ల అన్నీ దూర్చ‌డం. దీనికి ఓ అనామ‌క డైరెక్ట‌ర్ కావాలె. గ‌తంలో ఓ గుడుంబా శంక‌ర్‌.. ఇంకా చాలా సినిమాల్లో వేళ్లు దూర్చి ముక్కుమూతులు కాల్చుకున్నాడు. అయినా మార‌డు. త‌న‌కు తాను ఓ పే… ద్ద డైరెక్ష‌న్ స్కిల్స్ ఉన్నాయ‌నే భ్ర‌మ‌లో ఇప్ప‌టికీ బ‌తికేస్తున్నాడు.

జానీ సినిమాతో గంగ చంద్ర‌ముఖిగా మారిన‌ట్టుగా త‌న పైత్యాన్ని రంగ‌రించి.. త‌నకు క‌నీసం డైరెక్ష‌న్ తాలుకు వాస‌న‌లు కూడా తెలియ‌ద‌ని తెలియ‌జెప్పుకున్నాడు. ఇదంతా ఇప్పుడెందుకంటే.. ఇప్పుడు ఓజీలో కూడా అన్నీ దూర్చేశాడు. త‌న‌దైన పైత్యాన్ని రంగ‌రించి.. క‌త్తిని క‌స‌మిసా తిప్పేసి ర‌క్తాన్ని బుసబుసా పొంగించి.. ఓ డైలాగులేదు. ఓ పంచు లేదు. ఆ ముఖం మీద ఎటువంటి ఫీలింగ్సు పండ‌లేదు. సినిమానే ఆకు మీద ఒట్టి సున్నం నిండా రాసుకుని తింటే నోరు భుగ‌భుగా ఎట్ల మండుతుదో.. అంత‌క‌న్నా ఘోరంగా ఉంది ఈ సినిమా. డైరెక్ట‌ర్ సుజీత్‌కు మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి.

ఓ సారి ప్ర‌భాస్.. సాహో.. చంక‌నాకిచ్చేశాడు. ఇప్పుడు ఓజీ…గ‌జ్జి పుట్టించి గోక్కుని గోక్కుని ర‌క్తాలు వచ్చేలా చేశాడు. అభిమానులు కూడా గ‌ట్టిగా ఓ కేక‌.. ఓ ఈల వేసి సంద‌డి చేసుకుని చిందులేసుకునేలా ఒక్క సీన్ ఒక్క సీన్… ఒక్క డైలాగ్ అంటే ఒక్క డైలాగు లేదు. ఏవో ట్విస్టులు ఇద్దామ‌ని తీసిన సీన్స్ పెద్ద‌గా ర‌క్తి క‌ట్టించ‌లేదు. చివ‌ర‌కు సినిమా అంతా అయిపోయి.. అబ్బా ఒడిసిందిరా త‌ల‌నొప్పికి వెంటనే ఓ గోలీ వేసుకుని గ‌రం గ‌రం చాయ్ ఒక‌టి తాగాలె అని నుకునే లోపు.. మ‌ళ్లీ కొంచెం సీన్ స్క్రీన్ మీద … అవ‌స‌మైతే మ‌ళ్లీ వ‌స్తా.. అనే డైలాగు. మేముకూడా చూస్తామా లేదా అని అవ‌స‌రాన్ని బ‌ట్టి చెప్తాం.. అని వెనుక నుంచి ఎవ‌రో వీర వెర్రి అభిమాని అంటున్నాడు. తిక్క‌రేగి ఉంటుంది తిక్క‌లోడి తిక్క వేశాల‌కు.

You missed