రాజకీయ వ్యూహకర్త, సలహాదారు ప్రశాంత్ కిషోర్ సలహాలు కేసీఆర్ తీసుకుంటున్నాడని నిన్న మొన్న విన్నాం. దీనిపై టీఆరెస్ శ్రేణులే భగ్గుమన్నారు. టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్‌ను గుర్తించి.. వారికి అండగా ఉంటే పీకే లాంటి వాళ్ల అవసరం మనకెందుకు..? కేసీఆర్‌కు అవసరమా..? అని కూడా బహిరంగంగానే విమర్శించారు. ఇది మరవకముందే మరొక వ్యూహకర్త పేరు తెరమీదకు వచ్చింది. అతను రాజకీయ వ్యూహకర్త కాదు. ఓ రిపోర్టర్. ఓ ఎడిటర్. అదీ నమస్తే తెలంగాణకు. నమస్తే తెలంగాణ ఎడిటర్ ఎవరో తెలియదా..? తీగుళ్ల కృష్ణమూర్తి. అంటే టీకే అన్నమాట.
కేసీఆర్ పీకే మాటలు కాదు… ఈ టీకే మాటలు విని ఆగమైపోతున్నాడంట. మొన్న ఇదే మాట టీఆరెస్ అన్నది. ఇప్పుడు బీజేపీ కూడా అంటున్నది. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నోటి వెంట ఈ మాట వచ్చింది.ఇదిప్పుడు మీడియా సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నది. టీకే మాటలు విని పత్రికను భ్రష్టుపట్టించాడని, ఇప్పుడు పార్టీని కూడా నాశనం చేస్తున్నాడని ఆపార్టీ నేతలే చెబుతున్నాడని చెప్పుకొచ్చాడు. రిపోర్టర్‌గా ఉండదలిస్తే అలాటే ఉండు.. ఇలా అన్నింట్లో వేలు పెట్టి నాశనం చేయకండని కూడా రఘునందన్ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేశాడు.
అవునూ.. నిజంగా కేసీఆర్ ఈ టీకే సలహాలు వింటున్నాడా..?
నమస్తే తెలంగాణను అప్పగించిన వైనం.. ఆ తర్వాత అందులో వచ్చిన మార్పులు.. ఆ పత్రిక ప్రతిష్ట మరింత దిగజారిపోవడం…. ఉద్యోగులు రోడ్డు పాలు కావడం.. కోబ్రాలు వచ్చి చేరడం.. లోపల పెద్దల ప్రచ్ఛన్న యుద్దం.. అంతా నాదే పెత్తనం అనే రీతిలో టీకే వ్యవహారం.తన నీడను తనే నమ్మకపోవడం.. తనకు నచ్చిన వారికి అందలం లేదంటే మెడపట్టి గెంటేయడం.. ఇవన్నీ వ్యవహారాలు ఆయన వచ్చినంకనే పత్రికలో చోటు చేసుకున్నాయి. మరి ఈ పరిణామాలు చూస్తే తెలియడం లేదా… కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వందశాతం బ్లండర్ మిస్టేక్ అని.
ఇక పార్టీ లో జోక్యం విషయానికి వస్తే… కేసీఆర్ ఎవరో చెబితే వెంటాడా? వినే అంతా సీన్ ఉందా?
పత్రికనే అప్పగించి కాళ్లు చేతులు అన్నీ కాల్చుకున్నాడు. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. నమ్మి నానబోస్తే పుచ్చులైనట్టు తను తీసుకున్న నిర్ణయం ఎంత రాంగో కేసీఆర్‌కు తెలియదా..? తెలుసు. కానీ భరించాలి కొన్ని రోజులు.
పార్టీలో తను చెప్పిన మాటలు వినే పరిస్థితికి కేసీఆర్ ఒకవేళ వస్తే అంతకన్నా దివాళతనం మరోటి ఉండదు.
https://fb.watch/akONwFlDiz/
