(దండుగుల శ్రీనివాస్)
సిరిసిల్లకు ఎవరూ వెళ్లరట. అయితే దాని హెడ్డింగ్ ఎట్లుండాలె. నేను వెళ్ల.. లేదా నేను వెళ్లను. కానీ ఇక్కడ పెట్టిన హెడ్డింగ్.. నేను వెళ్లాను. అంటే వెళ్లాడు అని అర్థం. అచ్చం కొన్ని చెత్త యూట్యూబర్లు వ్యూస్ కోసం చెత్త కంటెంట్ పెట్టుకుని పైన థంబ్ నెయిల్ పెట్టే దాంట్లో మాత్రం అక్షర దోషాలు పట్టించుకోరు. పట్టించుకోరు అనే బదులు.. వాళ్లకు అది అక్షర దోషమని కూడా తెల్వదు పాపం. అంతే అవే తప్పులు అట్ల చేస్తనే ఉంటరు.
ఇప్పుడు ఈ దిశలో కూడా అట్లనే ఉంది. నేను వెళ్లాను.. అని పెట్టారు. నాకర్థం కాలే. ఈ హెడ్డింగ్ ఉద్దేశం, వార్త కంటెంట్ ఒకటై ఉండదని చదవితే. నిజమే. అక్కడికి ఎవరూ వెళ్లడం లేదనేది వార్త. కానీ వెళ్లారన్నట్టుగా హెడ్డింగ్. చూస్కోబడ్లా ఎడిటర్ సాబ్!
