చరిత్ర పొడవునా..
గాయపడిన మనోభావాలే, ఐతే..
మెచ్యూర్డ్ గా ఆలోచించించి చూడు !
మనోభావాలు పదిలంగానే ఉంటాయి !!
“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
#Right_to_offend
ఇందు మూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా……

సతీ సహగమనాన్ని వ్యతిరేకించడం కొందరి మనోభావాల్ని గాయపరిచింది.

అంటరానితనాన్ని వ్యతిరేకించడం కొందరి మనోభావాల్ని గాయపరిచింది.

బాల్య వివాహాలు తప్పు అనడం కొందరి మనోభావాల్ని గాయపరిచింది.

భర్త చనిపోయిన స్త్రీలకు మళ్లీ పెళ్లి చేయాలనడం కొందరి మనోభావాల్ని గాయపరిచింది.

స్త్రీలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించాలనడం కొందరి మనోభావాల్ని గాయపరిచింది.

భూమి గుండ్రంగా ఉంది అంటే కొందరి మనోభావాలు గాయపడ్డాయి.

సూర్యుడు భూమి చుట్టూ తిరగటం లేదు, భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటే కొందరి మనోభావాలు గాయ పడ్డాయి.

అన్ని కులాల వారు చదువుకోవాలంటే కొందరి మనోభావాలు గాయపడ్డాయి.

పోలియో రాకుండా ఉండాలంటే టీకా వేసుకోవాలే గానీ ముందు జన్మలో చేసిన కర్మల వల్లే అంగవైకల్యం వచ్చిందనడం మోసం, కర్మ సిద్దాంతం బూటకం అంటే కొందరి మనోభావాలు గాయపడ్డాయి.

చిన్న చిన్న ఆడపిల్లల్ని దేవుడికిచ్చి పెళ్లి చేసి, వారిని ఊరిపెద్దలు అత్యాచారం చేసే సంస్కృతిని ప్రశ్నించిన్నప్పుడు కూడా మనోభావాలు గాయపడ్డాయి.

ఇలా చరిత్రలో కొన్ని వందలసార్లు మనోభావాలు గాయపడ్డాయి.

ఒకవేళ మనోభావాల్ని గాయపరచడం తప్పు అనే నీతిని బండగా ఫాలో అయితే.. పైన చెప్పిన మార్పులు జరిగేవి కాదు. ఇప్పటికింకా నరబలులు జరుగుతూ ఉండేవి. అంబేద్కర్ లాంటి వ్యక్తులకు మనోభావాల్ని గాయపరచి, అశాంతిని రేకెత్తించే టెర్రరిస్టులు అని ముద్ర వేసేవారు.

అందువలన ఒక సమాజం యొక్క ఆలోచనలు వికసించాలి అంటే, మూఢత్వాన్ని పోగొట్టుకోవాలి. అంటే, ఎప్పటి నుండో అలవాటు పడిపోయిన ఆలోచనలు, సాంప్రదాయాలు మాత్రమే గొప్పవనే మూకుమ్మడి మాయలో కొట్టుకు పోకుండా వ్యతిరేక భావాల్ని కూడా విని అర్థం చేసుకొనే ఓర్పు, సహనం పెంపొందించు కోవాలి. విన్నాక, అవి తప్పు అనిపిస్తే సహేతుకంగా విమర్శించే గ్రేస్ఫుల్ మైండ్ సెట్ ని కలిగి ఉండాలి.

దానికి భిన్నంగా ప్రశ్నను, విమర్శను శత్రువుగా భావిస్తే మన మెదళ్లు బూజుపట్టిపోయి కుళ్ళిపోతాయి.

నీ చుట్టూ ఉన్నవారికి, నీ మనోభావాల్ని గాయపరిచే హక్కు కూడా ఉండటం వల్ల.,

నీ మనోభావాలెప్పుడూ నీ కంట్రోల్లో మాత్రమే ఉంటాయని తెలుసుకో., ఇతరులు వాటిని ఏమీ చేయలేరనే సత్యాన్ని గ్రహించు., అప్పుడే నీకు మెచ్యూరిటే వస్తుంది.

Let’s dive into that world of graceful debating and graceful living.

— Rambabu Thota

(Copied From:
Shariff Gora garu..)
— Rajeshwer Chelimela , Jvv Telangana